Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2023: టీమిండియాకు గుడ్ న్యూస్.. శ్రీలంక బయలు దేరుతున్న స్టార్ ప్లేయర్!

ఆసియా కప్‌లో తడబడుతున్న టీమిండియాకు శుభవార్త. చిన్నగాయంతో జట్టుకు దూరమైన స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ పూర్తిగా కోలుకున్నాడట. ఆసియా కప్ కోసం టీమిండియా శ్రీలంక బయలుదేరిన సమయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ.. రాహుల్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని, టోర్నీలో గ్రూప్ దశ మ్యాచులకు దూరం అవుతాడని చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా ఎన్సీయేలో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టును రాహుల్ క్లియర్ చేశాడట. దీంతో అతన్ని కూడా శ్రీలంక పంపేందుకు బీసీసీఐ ఏర్పాట్టు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న అతను సూపర్-4 దశ మ్యాచుల నుంచి జట్టుకు అందుబాటులోకి వస్తాడని సమాచారం. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాహుల్ గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అతను ఆటకు దూరంగానే ఉన్నాడు.

 Asia Cup 2023 Good news for Team India as KL Rahul clears fitness test

అయితే ఆసియా కప్‌కు ముందు అతను కోలుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆసియా కప్ కోసం జట్టును ఎంపిక చేస్తున్న సమయంలో.. మ్యాచ్ సిములేషన్స్, ప్రాక్టీస్ చేస్తుండగా రాహుల్‌కు ఫ్రెష్‌గా మరో చిన్న గాయమైంది. దీంతో అతను ఈ టోర్నీ ప్రారంభ మ్యాచులకు దూరమవ్వాల్సి వచ్చింది. ఈ కారణంగా అతను జట్టుతో కలిసి శ్రీలంకకు రాలేదు. వరల్డ్ కప్‌లో అతను కీలకం అని భావించిన బీసీసీఐ.. ముందు జాగ్రత్త చర్యగా రాహుల్‌ను ఎన్సీయేలోనే ఉంచింది.

ఇప్పుడు తన ఫిట్‌నెస్ టెస్టులు క్లియర్ చేసిన రాహుల్.. జట్టుతో కలిసేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే శ్రీలంక బయలుదేరి, సూపర్-4 మ్యాచుల నుంచి రాహుల్ ఆడతాడని సమచారం. కాగా, రాహుల్ గైర్హాజరీలో జట్టులో చోటు సంపాదించిన ఇషాన్ కిషన్.. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన సంగతి తెలిసిందే. జట్టు కష్టాల్లో ఉండగా సూపర్ ఇన్నింగ్స్‌తో పరిస్థితిని చక్కదిద్దాడు. అయినా సరే రాహుల్ వస్తే కిషన్‌ను పక్కన పెట్టాల్సి వస్తుందని సమాచారం.

Story first published: Monday, September 4, 2023, 8:48 [IST]
Other articles published on Sep 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+