Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sanju Samson: సంజూపై హార్ష్ కామెంట్స్.. అందుకే ఆసియా కప్ టీంలో లేడన్న మాజీ లెజెండ్!

ఆసియా కప్ ఆడే టీంను బీసీసీఐ ప్రకటించింది. ఈ టీంలో కేరళ యంగ్‌స్టర్ సంజూ శాంసన్‌కు అవకాశం దక్కలేదు. ట్రావెలింగ్ స్టాండ్ బై ప్లేయర్‌గా అతన్ని సెలెక్టర్లు తీసుకున్నారు. మెయిన్ స్క్వాడ్‌లో అతనికి చోటు దక్కలేదు. అది కూడా కేఎల్ రాహుల్‌కు గాయం అవడంతోనే సంజూను స్టాండ్ బై ప్లేయర్‌గా తీసుకున్నట్లు చీఫ్ సెలెక్టర్ అగార్కర్ చెప్పాడు.

ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీసులో సంజూ శాంసన్ ఫర్వాలేదనిపించాడు. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో అవకాశం దక్కని అతను.. రెండో మ్యాచ్‌లో 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే చివరిదైన మూడో మ్యాచ్‌లో 40 బంతుల్లోనే 51 పరుగులతో రాణించాడు. అయినా అతనికి ఆసియా కప్ జట్టులో చోటు దక్కలేదు.

Sanju Samson

దీని గురించి టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. 'సంజూ తనకు దక్కిన అవకాశాలను మరింత చక్కగా ఉపయోగించుకోవాల్సింది. అతను కనుక మరిన్ని పరుగులు చేసి ఉంటే.. కచ్చితంగా టీంలో చోటు దక్కేది. యుజ్వేంద్ర చాహల్ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఫామ్ కన్నా కూడా కొన్నిసార్లు సెలెక్టర్లు జట్టులో బ్యాలెన్స్ చూస్తారు' అని చెప్పాడు.

అలాగే కొందరు ప్లేయర్లు ఫీల్డింగ్, బ్యాటుతో ఎంత వరకు సపోర్ట్ ఇవ్వగలరు అనే విషయాలను కూడా దృష్టిలో ఉంచుకొని జట్టును ఎంపిక చేస్తారని గవాస్కర్ వివరించాడు. చాహల్ కన్నా కూడా కుల్దీప్ యాదవ్ బెటర్ బ్యాటర్ అని, అందుకే అతనికి సెలెక్టర్లు ఓటు వేసి ఉంటారని అన్నాడు. శాంసన్ విషయంలో కూడా సెలెక్టర్ల ఆలోచన ఇలాగే ఉండి ఉంటుందన్నాడు.

'సంజూ కీపింగ్ కూడా చేయగలడు. ఇలాంటి విషయాలపైనే సెలెక్టర్లు ఫోకస్ పెడతారు. అయినా సంజూ వయసు 29 సంవత్సరాలే.. ఇది అతని చివరి వరల్డ్ కప్ ఏం కాదు. టీమిండియాలోకి రావడానికి అతని దగ్గర చాలా సమయం ఉంది. ఇప్పుడు ప్రకటించిన టీం చాలా బాగుందని నా అభిప్రాయం' అని గవాస్కర్ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, August 22, 2023, 14:25 [IST]
Other articles published on Aug 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+