Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup Final: ఫైనల్‌కు కూడా అదే గతి.. వాతావరణ శాఖ అంచనాలతో ఫ్యాన్స్‌లో టెన్షన్!

ఆసియాలో నెంబర్ వన్ వన్డే టీం ఏదో తేలే రోజు రానే వచ్చింది. ఆసియా కప్ 2023 ఫైనల్‌కు సమయం దగ్గర పడింది. పాకిస్తాన్, శ్రీలంకను ఓడించిన భారత జట్టు అందరి కన్నా ముందు ఫైనల్ దూసుకొస్తే.. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ను ఓడించిన శ్రీలంక కూడా ఫైనల్‌కు చేరింది. లంక ఆడిన చివరి మ్యాచ్ ఆ టీంకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది.

అదే సమయంలో భారత్‌కు మాత్రం చివరి మ్యాచ్ చేదు జ్ఞాపకాలే మిగిల్చింది. బంగ్లాదేశ్‌పై భారత బ్యాటర్లలో ఒకరిద్దరు మినహా అందరూ విఫలమయ్యారు. బెంచ్ బలం పరీక్షించుకునేందుకు ఈ మ్యాచ్‌ను టీమిండియా ఉపయోగించుకుంది. ఈ క్రమంలో టీమిండియా బెంచ్ అంత బలంగా లేదని తేలిపోయింది. అయితే ఫైనల్‌లో తమ ఫస్ట్ చాయిస్ ఆటగాళ్లతోనే టీమిండియా ఆడుతోంది.

 Asia Cup Final

దీంతో భారత్ మరీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే శ్రీలంకలో జరిగిన ఆసియా కప్‌ మ్యాచుల్లో అందరి కన్నా నిలకడైన ప్రదర్శన వరుణుడిదే అని చెప్పాలి. ఒకటి, రెండు మ్యాచులు మినహా అన్ని మ్యాచులనూ వరుణుడు భయపెట్టాడు. ఈ క్రమంలో ఆదివారం జరిగే ఆసియా కప్ ఫైనల్‌కు కూడా వరుణుడు ముప్పు ఉందా? అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆదివారం నాడు కొలంబోలో 7.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఇక్కడ సాయంత్రం పూట 89 శాతం వర్షం పడే ఛాన్సులు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రోజు గడిచేకొద్దీ వర్షం పడే అవకాశాలు ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండనుంది. ఇదంతా చూసిన ఫ్యాన్స్.. ఈ మ్యాచ్ కూడా వర్షార్పణమేనా? అని బాధపడుతున్నారు.

అయితే భారత్, పాకిస్తాన్ మ్యాచులాగే.. ఈ ఫైనల్‌కు కూడా రిజర్వ్ డే ఉంది కాబట్టి ఫ్యాన్స్ మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆదివారం కనుక మ్యాచ్ పూర్తికాకపోతే.. అక్కడి నుంచే సోమవారం నాడు మ్యాచ్ మొదలవుతుంది. కాబట్టి రెండ్రోజులు కలిపి అయినా సరే పూర్తి మ్యాచ్ జరగడం ఖాయం. ఈ క్రమంలో సోమవారం వరకు వెయిట్ చేయకుండా.. ఆదివారమే మ్యాచ్ పూర్తవ్వాలని, వరుణుడు ఆటకు అడ్డంకి కాకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Story first published: Sunday, September 17, 2023, 8:04 [IST]
Other articles published on Sep 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+