Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2023: బౌలర్‌ను టాప్ బ్యాటర్ అనేశాడు.. క్రికెట్ బోర్డు చీఫ్ ఎలా అయ్యావ్?

క్రికెట్ బోర్డుకు చైర్మన్ అవ్వాలంటే క్రికెట్ ఆటగాడు అవ్వాల్సిన పనిలేదు. కానీ కనీసం క్రికెట్ పరిజ్ఞానం అవసరం కదా. కానీ తనకు అవేమీ లేవని నిరూపించుకున్నాడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్త చీఫ్. ఇటీవల ఆసియా కప్ షెడ్యూల్‌ను విడుదల చేయడానికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ), పీసీబీ కలిసి ఒక ఈవెంట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఈ షెడ్యూల్ విడుదలైన తర్వాత పాక్ మీడియా కోసం పీసీబీ మీడియా సమావేశం ఏర్పాటు చేసంది. ఈ సమావేశంల పీసీబీ కొత్త చీఫ్ జాకా అష్రాఫ్ కూడా పాల్గొన్నాడు. ఈసారి ఆసియా కప్‌కు పాకిస్తాన్, శ్రీలంక రెండు దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పిన జాకా అష్రాఫ్.. తమ జట్టులో చాలా సత్తా ఉందన్నాడు.

PCB Chief

అయితే ఇక్కడే ఆయన తప్పులో కాలేశాడు. ప్రపంచ టాప్ టెన్ బ్యాటర్లలో షహీన్ షా అఫ్రిదీ పేరు కూడా ఉంటుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అఫ్రిదీ బౌలర్ అన్న సంగతి తెలిసిందే. పీఎస్ఎల్‌లో బ్యాటుతోనూ అతను ఆకట్టుకున్న మాట వాస్తవమే. కానీ అంతర్జాతీయ స్థాయిలో అతని బ్యాటింగ్ కేవలం బౌలర్ స్థాయిలోనే ఉంది. అలాంటి వాడిని ప్రపంచంలో టాప్ టెన్ బ్యాటర్లలో ఒకడనేశాడీ పీసీబీ చీఫ్.

'మన టీం బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో చాలా బలంగా ఉంది. బ్యాటింగ్ విషయంలో మన కెప్టెన్ బాబర్ ఆజమ్ నెంబర్ వన్ బ్యాటర్. మిగతా వాళ్లు కూడా టాప్-5లో ఉంటారు' అని అష్రాఫ్ అన్నాడు. అక్కడితో ఆగకుండా.. 'ఇక షహీన్ షా అఫ్రిదీ గురించి మాట్లాడుకుంటే.. టాప్ టెన్ బ్యాటర్లలో అతని పేరుంటుంది. ఇంత బాగా రాణిస్తున్న పాకిస్తాన్ జట్టుకు నా బెస్ట్ విషెస్' అని చెప్పాడు.

ఇది విన్న ఫ్యాన్స్ అతన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు. కనీసం బ్యాటర్లు ఎవరో, బౌలర్లు ఎవరో కూడా తెలియని వ్యక్తి పీసీబీ చీఫ్ ఎలా అయ్యాడని ప్రశ్నిస్తున్నారు. షహీన్ టాప్ టెన్ బ్యాటర్లలో ఉంటే బాబర్, రిజ్వాన్ వీళ్లంతా బౌలర్లా? అని అడుగుతున్నారు. ఏదేమైనా ఇాలా నోరు జారిన అష్రాఫ్ నవ్వులపాలవుతున్నాడు.

Story first published: Saturday, July 22, 2023, 14:17 [IST]
Other articles published on Jul 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+