For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గంభీర్ వర్సెస్ అక్మల్.. భజ్జీ వర్సెస్ అక్తర్.. ఆసియా కప్‌‌లో మర్చిపోలేని గొడవలివే!

మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ మొదలవనుంది. ఈ టోర్నీ కోసం ప్రధాన జట్లన్నీ రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆసియా కప్‌లో చాలా గొడవలు జరిగాయి. ఫ్యాన్స్ వీటిని ఎప్పటికీ మర్చిపోలేరు. అలాంటి కొన్ని గొడవలు ఏంటో ఒకసారి గుర్తుచేసుకుంటే..

గంభీర్ వర్సెస్ అక్మల్
భారత్, పాకిస్తాన్ మ్యాచులు ఎప్పుడు జరిగినా వాటి హీట్ వేరే ఉంటుంది. ఆటగాళ్ల మధ్య కూడా ఆ వేడి కనిపిస్తుంది. ఇలాగే 2010 ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ తలపడినప్పుడు టీమిండియా ఓపెనర్ గంభీర్, పాక్ కీపర్ కమ్రాన్ అక్మల్ గొడవ పడ్డారు.

Asia Cup 2023

సయీద్ అజ్మల్ వేసిన బంతికి గంభీర్ కీపర్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ సమయంలో అక్మల్, గంభీర్ మధ్య వాగ్వాదం జరిగింది. మధ్యలో ధోనీ కలుగజేసుకుంటే కానీ ఈ గొడవ సద్దుమణగలేదు.

షకీబల్ హసన్
ఇక ఇలాగే 2016 ఆసియా కప్‌లో బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్ కూడా పెద్ద ఇష్యూ చేశాడు. పాక్ పేసర్ మహమ్మద్ ఆమిర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడీ ఆల్‌రౌండర్. దీంతో కోపం తెచ్చుకున్న అతను వెళ్లి వికెట్లను విరగ్గొట్టేశాడు. దీంతో ఐసీసీ కూడా షకీబల్ హసన్‌పై సీరియస్ యాక్షన్ తీసుకుంది.

Asia Cup 2023

భజ్జీ వర్సెస్ అక్తర్
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్, పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మధ్య కూడా ఇలాగే ఆసియా కప్‌లో గొడవ జరిగింది. 2001 టోర్నీలో దాయాదుల పోరు జరిగింది. మ్యాచ్ చివర్లో భజ్జీపై అక్తర్ మాటల దాడి చేశాడు. వీళ్లిద్దరూ గొడవ పడినా చివర్లో ఆమిర్ బౌలింగ్‌లో భారీ షాట్‌తో మ్యాచ్ ముగించిన భజ్జీ ప్రతికారం తీర్చుకున్నాడు.

Asia Cup 2023

ధోనీ వర్సెస్ టస్కిన్
ఆసియా కప్ 2016కు ముందు బంగ్లా పేసర్ టస్కిన్ అహ్మద్.. ధోనీ తల నరికి తీసుకెళ్తున్న ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇది పెద్ద ఇష్యూ అయింది. దీనిపై ఫ్యాన్స్‌తోపాటు మాజీ క్రికెటర్లు కూడా చాలా కఠినంగా రియాక్ట్ అయ్యారు.

బీసీసీఐ వర్సెస్ పీసీబీ
ఇక ఈ ఏడాది ఆసియా కప్ షెడ్యూల్ ఫిక్స్ అవడానికి ముందు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ), పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య జరిగిన గొడవ అందరికీ తెలిసిందే. తమ టీంను పాక్‌కు పంపడం కుదరదని బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో ఈ రెండు బోర్డుల మధ్య వాగ్వాదం మొదలైంది. చివరకు పాక్ బోర్డు ప్రతిపాదించిన హైబ్రీడ్ మోడల్‌కు గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఈ గొడవ సద్దుమణిగింది.

Story first published: Sunday, August 20, 2023, 17:04 [IST]
Other articles published on Aug 20, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+