Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2023: చాహల్‌కు ఛాన్స్ ఇవ్వని బీసీసీఐ.. భార్య ధనశ్రీ క్రిప్టిక్ పోస్టు వైరల్!

ఆసియా కప్ ఆడే టీంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కలేదు. జట్టులో ఒకే రిస్ట్ స్పిన్నర్‌ను తీసుకునే అవకాశం ఉందని, ఈ కారణంగానే తాము చాహల్‌ను తీసుకోలేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పాడు. దీనిపై చాలా మంది మాజీలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

చాహల్‌ చాలా కీలకమైన స్పిన్నర్ అని, అతన్ని జట్టులోకి తీసుకోవాల్సిందని పలువురు చెప్పారు. హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు తామైతే కచ్చితంగా చాహల్‌ను తీసుకునే వాళ్లమన్నారు. అదే సమయంలో ఫీల్డింగ్ బ్యాటింగ్ విభాగాల్లో చాహల్ కొంత వెనుక పడ్డాడని, అందుకే అతనికి జట్టులో స్థానం దక్కలేదని చెప్పారు.

Yuzvendra Chahal Dhanashree Verma

ఇలాంటి సమయంలో చాహల్ భార్య ధనశ్రీ తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్న పోస్టు వైరల్ అవుతోంది. తన భర్తకు ఆసియా కప్ టీంలో చోటు దక్కకపోవడంపై డైరెక్టుగా ఆమె ఎలాంటి కామెంట్ చేయకపోయినా.. ఈ పోస్టు మాత్రం దాని గురించే అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

'చెప్పినట్లు వింటూ ఇంట్రావర్ట్‌లా ఉంటే మన కెరీర్ ఎదుగుదలకు నష్టం జరుగుతుందా? లేదంటే మనందరం కూడా ఎక్స్‌ట్రావర్టుల్లా మారిపోయి, మాటకారి తనంతో జీవితంలో ఎదగడం నేర్చుకోవాలా? అని చాలా సీరియస్‌గా ఆలోచించడ మొదలు పెట్టా' అని ఆమె పోస్టు పెట్టింది.

టీమిండియా స్పిన్ బౌలింగ్ బాధ్యతలను రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌కు అప్పగించాలని సెలెక్టర్లు నిర్ణయించారు. ఇలాంటి సమయంలో ధనశ్రీ ఇలా పోస్టు పెట్టడం నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే ఆమె మాటకారితనంతో బతకడం గురించి చెప్పడాన్ని కూడా ఫ్యాన్స్ రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు.

అయితే ఆమె కుల్దీప్ యాదవ్‌ను టార్గెట్ చేసిందని మాత్రం ఎవరూ పెద్దగా భావించడం లేదు. ఈ టీంలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ సహా ఆరుగురు ముంబై ఇండియన్స్ జట్టు ప్లేయర్లే ఉన్నారు. దీనిపై ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న ఫ్యాన్స్‌కు ధనశ్రీ కామెంట్స్ మరింత అసహనం పెంచుతున్నాయి. ఇదంతా కావాలనే చేస్తున్నారని మండిపడుతున్నారు.

Story first published: Tuesday, August 22, 2023, 15:23 [IST]
Other articles published on Aug 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+