Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2023: ఆసియా కప్‌లో సీఎస్‌కే స్టార్‌ తొలి మ్యాచ్.. ‘నాగిన్’ డ్యాన్స్‌కు అంతా రెడీ అంటున్న ఫ్యాన్స్!

ఆసియా కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక తొలి మ్యాచ్ ఆడేందుకు రెడీ అయింది. పల్లెకెలె వేదికగా బంగ్లాదేశ్‌ టీంను శ్రీలంక ఢీకొట్టనుంది. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్‌లో 'నాగిన్' డ్యాన్స్ చేసేందుకు ఫ్యాన్స్ కూడా ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ తాము ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. పల్లెకెలె పూర్తి బ్యాటింగ్ పిచ్ అని తెలుస్తోంది.

ఇలాంటి పిచ్‌పై ఎవరైనా ఛేజింగ్ తీసుకుంటారని, కొంచెం వర్షం పడే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అంటున్నారు. ఇక్కడకు దగ్గరలోని కాండీ సహా తదితర ప్రాంతాల్లో వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపినట్లు సమచారం. అయితే ఈ పిచ్ చాలా డ్రైగా కనిపిస్తోందని, అందుకే ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేయాలని అనుకుంటున్నామని బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ చెప్పాడు.

Pathirana

స్వదేశంలో శ్రీలంక చాలా బలమైన జట్టని, కాబట్టి తాము కూడా తమ బెస్ట్ ఆటను ప్రదర్శించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌ గురించే తాము ఆలోచిస్తున్నామని, ఈ వంద ఓవర్లపాటు శ్రీలంక కన్నా మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో బరిలో దిగుతున్నట్లు వెల్లడించాడు. వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి బంగ్లా నిర్ణయం తమకు కలిసొస్తుందని శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక అన్నాడు.

తమ టీంలో కీలకమైన ప్లేయర్లు గాయాలపాలయ్యారని, కానీ అన్ని సమస్యలనూ తాము కవర్ చేసుకున్నామని అన్నాడు. ఇక్కడ లంక ప్రీమియర్ లీగ్‌ మ్యాచులను బట్టి స్పిన్‌కు పిచ్ నుంచి సహకారం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అభిమానులు తమకు మద్దతు ఇస్తారు కాబట్టి ఆసియా కప్ కోసం చాలా ఉత్సుకతగా ఎదురు చూస్తున్నామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే యంగ్ పేసర్ పతిరాణా, వెల్లలెగే ఇద్దరూ ఆడుతున్నట్లు షనక వెల్లడించాడు.

Story first published: Thursday, August 31, 2023, 15:11 [IST]
Other articles published on Aug 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+