Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsNEP: భారత్‌తో మ్యాచ్‌లో నేపాల్ ప్లేయర్లకు బంపరాఫర్ ఇచ్చిన బడా కంపెనీ!

ఆసియా కప్ 2023లో సూపర్-4 దశకు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ కోసం నేపాల్ రెడీ అవుతోంది. ఈ స్థానం కోసం బలమైన టీమిండియాను ఢీకొంటోంది. ఈ మ్యాచ్ కోసం రెడీ అవుతున్న నేపాల్ టీంకు ఒక కంపెనీ బంపరాఫర్ ప్రకటించింది. నేపాల్‌కు చెందిన అర్ణ బీర్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. దీంతో భారత్‌తో మ్యాచ్‌లో తమ ప్లేయర్లను ఎంకరేజ్ చేయాలని అనుకుంటోంది.

ఇంతకీ ఆ ఆఫర్ ఏంటో తెలుసా? టీమిండియాతో మ్యాచ్‌లో నేపాల్ బౌలర్లు తీసే ప్రతి వికెట్‌కూ రూ. లక్ష రూపాయలు నజరానా ప్రకటించింది. ఇలా కేవలం బౌలర్లకే కాదు. బ్యాటర్లకూ మంచి ఆఫర్ ఇచ్చింది. టీమిండియా బౌలర్లు వేసే ఏ బంతిని సిక్సర్ బాదినా ఒక్కో సిక్సర్‌కు రూ.లక్ష బహుమతి ఇస్తానని చెప్పింది. అలాగే ఫోర్ బాదితే రూ.25 వేలు నజరానా ప్రకటించింది.

Asia Cup 2023 Cash prizes for Nepal players as big company gives bumper offer

ఇలా తమ ప్లేయర్లు మరింత మోటివేట్ అవుతారని అర్ణ బీర్స్ భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌ కూడా పూర్తిగా జరిగే సూచనలు కనిపించడం లేదు. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కూడా భారత్, పాక్‌ మ్యాచ్ లాగే సగం మాత్రమే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాక్‌పై భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ తర్వాత వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్ జరగలేదన్న సంగతి తెలిసిందే.

మ్యాచ్‌ రోజు ఉదయం వర్షం పడే అవకాశం 90 శాతం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అదే మ్యాచ్ మొదలయ్యే సమయానికి ఇది 68 శాతానికి తగ్గుతుందట. మళ్లీ సాయంత్రం రెండో ఇన్నింగ్స్ మొదలయ్యే సమయానికి వర్షం పడే అవకాశాలు మరోసారి పెరుగుతాయట. అంతకుముందు పాక్‌తో మ్యాచ్ కూడా ఫలితం తేలకుండానే ముగియడంతో భారత్ ఖాతాలో కేవలం ఒక్క పాయింట్ మాత్రమే ఉంది.

ఒకవేళ నేపాల్‌తో మ్యాచ్ పూర్తిగా జరిగి, భారత్ గెలిస్తే మూడు పాయింట్లతో టీమిండియా సూపర్-4కు చేరుకుంటుంది. నేపాల్ గెలిస్తే రెండు పాయింట్లతో ఆ టీం సూపర్-4కు చేరుతుంది. టోర్నీ ఓపెనర్‌గా పాకిస్తాన్ చేతిలో నేపాల్ చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. అదే ఈ మ్యాచ్ కూడా వర్షం వల్ల ఫలితం తేలకపోతే.. రెండు పాయింట్లతో భారత జట్టు సూపర్-4కు చేరుతుంది. అప్పుడే కేవలం ఒక్క పాయింట్ మాత్రమే ఉన్న నేపాల్ ఇంటి దారి పడుతుంది.

Story first published: Monday, September 4, 2023, 12:33 [IST]
Other articles published on Sep 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+