Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2023 : తెలుగోడికి చోటు.. ఆసియా కప్‌ జట్టును ప్రకటించిన బీసీసీఐ!

ఆసియా కప్‌లో తలపడే జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో అందరూ ఊహించినట్లుగానే కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ పునరాగమనం చేశారు. అయితే వీళ్లు ఈ టోర్నీ నాటికి కోలుకుంటారా? అనేది అనుమానంగా ఉంది. రాహుల్ ఇప్పటికే బ్యాటింగ్, కీపింగ్ డ్రిల్స్ మొదలు పెట్టేశాడు.

కాబట్టి అతను ఆసియా కప్ సమయానికి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉంది. అయితే అయ్యర్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అలాగే ఇటీవలి కాలంలో బాగా విఫలం అవుతున్న శుభ్‌మన్ గిల్‌పై కూడా సెలెక్టర్లు నమ్మకం ఉంచారు. రోహిత్‌కు జోడీగా అతన్నే ఓపెనర్‌గా సెలెక్ట్ చేశారు.

BCCI announced Asia cup 2023 Squad

అలాగే వన్డేల్లో చెత్త రికార్డు ఉన్న సూర్యకుమార్ యాదవ్‌పై కూడా నమ్మకం ఉంచారు. అతన్ని ఈ టోర్నీలో ఫినిషర్‌గా చూసే అవకాశం ఉంది. ఎవరూ ఊహించని విధంగా తిలక్ వర్మకు కూడా ఆసియా కప్‌లో అవకాశం దక్కింది. అతన్ని ఆడించాలని పలువురు మాజీలు చెప్పినప్పటికీ.. కొత్త కుర్రాడికి అవకాశం దక్కుతుందని ఎవరూ అనుకోలేదు.

ఇక మూడో ఓపెనర్ కోటాలో ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేశారు. వన్డేల్లో కిషన్ మంచి ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఒకవేళ గిల్ కనుక రాణించకపోతే అతని స్థానాన్ని కిషన్ భర్తీ చేసే అవకాశం ఉంది. వైస్ కెప్టెన్‌గా జస్‌ప్రీత్ బుమ్రాను నియమిస్తారని, ఈ పదవి నుంచి హార్దిక్ పాండ్యాను తొలగిస్తారని జరిగిన ప్రచారానికి కూడా సెలెక్టర్లు తెరదించారు.

ఫ్యూచర్ వైట్ బాల్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యానే చూస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ టోర్నీలో అతన్నే వైస్ కెప్టెన్‌గా నియమించారు. అలాగే ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్‌ను కూడా జట్టులోకి తీసుకున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా జట్టులోకి రాగా.. యుజ్వేంద్ర చాహల్‌ను పక్కన పెట్టేశారు.

ఆసియా కప్‌కు భారత బృందం: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ధ్ కృష్ణ

స్టాండ్‌బై ప్లేయర్: సంజూ శాంసన్

Story first published: Monday, August 21, 2023, 16:26 [IST]
Other articles published on Aug 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+