For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎవరు ఎవరితో నాగిన్ డాన్స్ చేయిస్తారో గానీ..!!

కొలంబో: ఆసియా కప్ 2023లో భాగంగా గ్రూప్ బీలో బంగ్లాదేశ్- శ్రీలంక మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ టోర్నమెంట్‌లో ఈ రెండు జట్లకూ ఇదే తొలి మ్యాచ్. గెలిచిన జట్టు ఫైనల్ వైపు ముందడుగు వేయగలుగుతుంది.

తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ అదరగొట్టిన విషయం తెలిసిందే. పసికూన నేపాల్‌‌ను ఏకంగా 238 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ముల్తాన్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నేపాల్.. 23.4 ఓవర్లల్లో 104 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచింది బాబర్ సేన.

Asia Cup 2023: Bangladesh vs Sri Lanka Playing 11 andpitchreport is here

బంగ్లాదేశ్‌పై నాగిన్ డాన్స్ పగ తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది శ్రీలంక. సొంతగడ్డపై బంగ్లాను మట్టి కరిపించడానికి ఉవ్విళ్లూరుతోన్నప్పటికీ.. బౌలింగ్ విభాగం బలహీనపడటం స్పీడ్ బ్రేకర్‌గా మారింది. గాయాలు శ్రీలంక బౌలింగ్‌ విభాగాన్ని దెబ్బ కొట్టాయి. దుష్మంత చమీర, లహిరు కుమార, దిల్షన్ మధుశంక, వనిందు హసరంగ.. గాయాల బారిన పడ్డారు. ప్రస్తుతం మహీష్ తీక్షణనే నమ్ముకుంది శ్రీలంక.

తాను ఆడిన చివరి అయిదు వన్డేల్లో ఘన విజయం సాధించిన ఊపులో ఉంది లంక జట్టు. అటు బంగ్లాదేశ్ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఇప్పటికే డాషింగ్ ఓపెనర్ లిట్టన్ దాస్.. గాయాల దెబ్బకు టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. హోమ్ గ్రౌండ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై జరిగిన మ్యాచ్‌లను గెలవడానికి శ్రమించాల్సి వచ్చింది. చివరి అయిదు మ్యాచ్‌లల్లో మూడింట్లోనే నెగ్గిందా జట్టు.

ఈ పరిణామాల మధ్య ఈ రెండు జట్ల కూర్పు ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. శ్రీలంక ప్లేయింగ్ 11లో- దిముత్ కరుణరత్నే, పాథుమ్ నిశ్శంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దాసన్ షనక (కెప్టెన్), దుషాన్ హేమంత/దునిత్ వెల్లలాగే, మహీష్ తీక్షణ, బినూర ఫెర్నాండో, కసున్ రజిత ఆడొచ్చు.

బంగ్లాదేశ్ తుదిజట్టులో- మహ్మద్ నదీం, తంజిద్ హసన్/అనాముల్ హక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్ (కేప్టెన్), తౌహిద్ హృదొయ్, ముష్కికుర్ రహీం (వికెట్ కీపర్), అఫిఫ్ హొస్సేన్, మెహదీ హసన్ మిర్జా, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, షోరిఫుల్ ఇస్లామ్ ఆడే అవకాశాలు ఉన్నాయి.

Story first published: Thursday, August 31, 2023, 10:44 [IST]
Other articles published on Aug 31, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+