Asia Cup 2023: ఓటమికి బాధ్యత నాదే.. అందుకే ఓడిపోయాం: బంగ్లా కెప్టెన్
ఆసియా కప్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక ఘనంగా ఆరంభించింది. తమ తొలి మ్యాచ్‌లో బంగ్లా టైగర్స్‌ను చిత్తు చేసింది. పల్లెకెలె వేదికగా జరిగిన తమ ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. డ్రై పిచ్‌పై భారీ స్కోరు చేసి లంక టీంపై ఒత్తిడి పెంచాలన్నది అతని ఆలోచన. కానీ శ్రీలంక బౌలర్లు అద్భుతమైన ప్రదర్శనతో ఈ ప్లాన్‌పై నీళ్లు చల్లారు.
లంక స్పిన్నర్ తీక్షణ, యంగ్ పేసర్ పతిరాణా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా పతిరాణా ఏకంగా నాలుగు వికెట్లు తీసుకొని చెలరేగాడు. దీంతో బంగ్లా టీం ఏ దశలోనూ భారీ స్కోరు దిశగా సాగలేదు. కేవలం నజ్ముల్ షాంటో (89) మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు. బంగ్లా టీంలో ఏడుగురు ప్లేయర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు. దీంతో బంగ్లా కేవలం 164 పరుగులకే ఆలౌట్ అయింది.

స్వల్ప లక్ష్య ఛేదనను లంక కూడా తడబడుతూనే ఆరంభించింది. అయితే మిడిలార్డర్‌లో సమర విక్రమ (54), చరిత్ ఆశలంక (62 నాటౌట్) అద్భుతంగా పోరాడారు. చివర్లో కెప్టెన్ దాసున్ షనక (14 నాటౌట్),ఆశలంక కలిసి శ్రీలంకను విజయతీరాలకు చేర్చారు. ఇలా బంగ్లాపై ఘనవిజయంతో ఆసియా కప్ 2023ను శ్రీలంక అద్భుతంగా ఆరంభించింది. ఈ క్రమంలో తమ ఓటమికి బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ బాధ్యత తీసుకున్నాడు.
'ఈ పిచ్‌పై అనుకున్న స్కోరు చేయలేకపోయాం. ఇదేం 300 పరుగులు చేయగలిగే వికెట్ కాదు. కానీ కనీసం 220-230 పరుగులు చేయాల్సింది. తమీమ్ ఇక్బాల్, లిటాన్ దాస్ లేకపోవడంతో నాపై మరింత బాధ్యత పెరిగింది. కానీ నేను దాన్ని సరిగా నిర్వర్తించలేకపోయా. ముఖ్యంగా బ్యాటింగ్ యూనిట్‌గా మేం చాలా నిరాశపరిచాం' అని షకీబల్ హసన్ చెప్పుకొచ్చాడు. తను బ్యాటింగ్‌లో విఫలమయ్యానని ఒప్పుకున్నాడు.
'బౌలింగ్ సమయలో శ్రీలంక 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ టైంలో ఇంకో రెండు, మూడు వికెట్లు తీస్తే మ్యాచ్‌పై పట్టు బిగించొచ్చని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ అద జరగలేదు. చాలాకాలం నుంచి బౌలర్లు, స్పిన్నర్లు బాగా రాణిస్తున్నారు. కానీ స్కోరు బోర్డుపై కావలసినన్ని పరుగులు లేవు' అని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో పది ఓవర్లు వేసిన షకీబ్.. కేవలం 29 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు.
అలాగే ఆసియా కప్‌లో మొదటి మ్యాచ్ నేపథ్యంలో ఒత్తిడి గురించి మాట్లాడాడు. 'మ్యాచ్ మొదలైనప్పుడు చాలా ఒత్తిడిలో ఉన్నాం. కానీ మ్యాచ్ సాగేకొద్దీ నెమ్మదిగా ఆఫీలింగ్ పోయింది. బ్యాటింగ్ ఆరంభించినప్పుడు కొంత టెన్షన్ ఉంది. కానీ 20వ ఓవర్ దగ్గర్నుంచి కంఫర్టబుల్‌గానే ఫీలయ్యాం. ఆశించిన స్కోరు చేయకపోవడం వల్లే ఓడిపోయాం' అని పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications