For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Asia Cup 2023: అరంగేట్రంలో డకౌట్.. సీఎస్‌కే స్పిన్నర్ దెబ్బకు కుర్రాడు విలవిల!

ఆసియా కప్‌లో బంగ్లా టైగర్స్‌కు షాకింగ్ ఆరంభం దక్కింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వర్షం పడే అవకాశం ఉన్న మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం ఏంటి? అని చాలామంది అన్నారు. అయితే పిచ్ డ్రైగా ఉండటం వల్ల ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేయాలని అనుకుంటున్నట్లు షకీబల్ హసన్ చెప్పాడు.

అయితే అతని ఆశలపై బంగ్లా ఓపెనర్లు గల్లంతు చేశారు. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన బంగ్లా బ్యాటర్ తంజిద్ హసన్ కనీసం ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరాడు. స్టార్ స్పిన్నర్ తీక్షణ వేసిన తొలి ఓవర్లోనే బంగ్లాకు షాకిచ్చాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో బంతి అందుకున్న తీక్షణ తొలి బంతికే హసన్‌ను ఇబ్బంది పెట్టాడు. ఆ మరుసటి బంతికే హసన్ ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు.

tanzid hasan

తీక్షణ వేసిన డెలివరీని డిఫెండ్ చేసుకోవడానికి హసన్ ప్రయత్నించాడు. లెగ్ స్టంప్ లైన్‌లో తీక్షణ వేసిన బంతి.. మిడిల్ వికెట్ వైపు కొద్దిగా మళ్లింది. దాన్ని హసన్ అడ్డుకోవడంలో తడబడ్డాడు. దీంతో అతని బ్యాటును తప్పించుకున్న బంతి హసన్ వెనుక కాలికి తగిలింది. వెంటనే శ్రీలంక ప్లేయర్లు అప్పీల్ చేయగా.. అంపైర్ అవుటిచ్చాడు. దీంతో హసన్ అరంగేట్రంలో డకౌట్ అయి వెనుతిరిగాడు.

అయితే తీక్షణ డెలివరీ మాత్రం సూపర్‌గా ఉందని ఫ్యాన్స్, నిపుణులు మెచ్చుకుంటున్నారు. హసన్ అవుటైన తర్వాత నజ్ముల్ షాంటో క్రీజులోకి వచ్చాడు. ఈ ఇద్దరు కూడా చాలా నిదానంగా బ్యాటింగ్ చేయడంతో బంగ్లాకు అనుకున్నట్లు అదిరే ఆరంభం లభించలేదు. డ్రై పిచ్‌పై భారీ స్కోరు చేయాలని అనుకున్న షకీబల్ హసన్‌కు ఇది కచ్చితంగా తలనొప్పి తెప్పించే అంశమే. మరి ఆ తర్వాత వచ్చే బ్యాటర్లు ఏ మాత్రం రాణించి, బంగ్లాకు ఎంత స్కోరు అందిస్తారో చూడాలి.

Story first published: Thursday, August 31, 2023, 15:46 [IST]
Other articles published on Aug 31, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+