Babar vs Shaheen: బాబర్ వర్సెస్ షహీన్.. అసలు గొడవ మొదలైంది మైదానంలోనే?
పాకిస్తాన్ టీం కెప్టెన్ బాబర్ ఆజమ్, స్టార్ ప్లేయర్ షహీన్ అఫ్రిదీ మధ్య పెద్ద గొడవ జరిగినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అసలు ఈ గొడవకు కారణం కేవలం డ్రెస్సింగ్ రూంలో అఫ్రిదీ చేసిన కామెంట్స్ కాదని తెలుస్తోంది. మైదానంలో పాక్ ఓటమికి షహీన్ అఫ్రిదీ అతి తెలివేనంటూ కొందరు పాక్ క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
శ్రీలంకతో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో చివరి బంతికి పాకిస్తాన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన స్థితిలో బౌలింగ్ చేసిన కొత్త కుర్రాడు జమన్ ఖాన్‌కు ఏ బంతి వేయాలో బాబర్ చెప్పేశాడు. దానికి తగ్గట్లే లెగ్ సైడ్ ఫీల్డర్‌ను తీసేశాడు. అవసరమైతే శ్రీలంకకు సింగిల్ ఇచ్చి సూపర్ ఓవర్‌కు వెళ్లొచ్చని బాబర్ ప్లాన్.

ఇలాంటి సమయంలో ఫ్రేమ్‌లోకి షహీన్ అడుగు పెట్టాడు. జమన్‌తో మాట్లాడిన అతను యార్కర్ వేయాలని సలహా ఇచ్చాడు. అదే చేయడానికి జమన్ ప్రయత్నించాడు. దీన్ని లెగ్ సైడ్ ఆడిన ఆశలంక డబుల్ తీసి జట్టుకు విజయం అందించాడు. ఆ సమయంలో బాబర్ ఎక్స్‌ప్రెషన్ చూస్తేనే అతను ఎంత అసహనం ఫీలయ్యాడో అర్థం చేసుకోవచ్చు.
ఇదే కోపంలో డ్రెస్సింగ్ రూంలో కూడా బాబర్ అక్కసు వెళ్లగక్కాడు. ముఖ్యంగా సీనియర్ ప్లేయర్లు రాణించాల్సిన అవసరం ఉందని, వరల్డ్ కప్‌లో ఇలాగే జరిగితే పరిస్థితి సీరియస్‌గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. అదే సమయంలో షహీన్ కలగజేసుకొని, అంతా నెగిటివ్ చూడటం అనవసరమని, పాజిటివ్ చూస్తూ బాగా ఆడిన వాళ్లను ముందు మెచ్చుకోవాలని సూచించాడు.
దీంతో అప్పటికే మండిపోతున్న బాబర్ 'అందరూ స్టార్లు అవ్వడానికి ట్రై చెయ్యొద్దు' అంటూ చురకలేశాడు. ఈ మాటలు విన్న అఫ్రిదీ కూడా సీరియస్ అయిపోయాడు. వీళ్ల గొడవ ముదిరేలా ఉందని భావించిన రిజ్వాన్ తదితరులు కలగజేసుకొని గొడవ పెద్దది అవకుండా అడ్డుకున్నారు. అయితే బాబర్ మాత్రం కోపంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఎవరికీ చెప్పకుండా శ్రీలంక నుంచి స్వదేశానికి బయలుదేరిపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications