ఆసియా కప్ ఫైనల్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచులో పాకిస్తాన్ ఓడిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో జరిగిన మ్యాచులో చివరి బంతికి పాకిస్తాన్ టీం ఓటమిపాలైంది. చివరి బంతి వేయగానే కెప్టెన్ బాబర్ ఆజమ్ ఎంత చికాకు పడిందీ చాలా స్పష్టంగా కనిపించింది. తను చెప్పింది ఏదో జరగనట్లే బాబర్ బాధ పడటం అంతా చూశారు. అయితే ఆ తర్వాత కాసేపటికే అతను నార్మల్ అయిపోయాడు.
మ్యాచ్ అనంతరం తన అభిప్రాయాలు చెప్పిన బాబర్.. డ్రెస్సింగ్ రూంలో విరుచుకుపడ్డాడట. తన టీంమేట్స్‌పై చాలా కోపం ప్రదర్శించాడట. ఇలాంటి చెత్త ప్రదర్శనలు చేయొద్దని, వరల్డ్ కప్‌లో ఇలా ఆడితే ఏమాత్రం ఊరుకోనని వార్నింగ్ ఇచ్చాడట. 'అందరూ స్టార్లు అవ్వాలని చూస్తున్నారు. ఇవే తగ్గించుకుంటే మంచిది' అని సీరియస్ అయిపోయాడట బాబర్.

అదే సమయంలో బాగా ఆడిన వాళ్లను మెచ్చుకోవాలని స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ అన్నాడట. దీంతో బాబర్‌కు మరింత కోపం వచ్చి అందర్నీ తెగ తిట్టేశాడట. ఈ క్రమంలో అఫ్రిదీతో బాబర్‌కు పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అప్పుడు వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ కలగజేసుకొని గొడవను అడ్డుకున్నాడట. ఈ నేపథ్యంలో కోపంగా ఉన్న బాబర్.. తన టీంమేట్స్‌కు చెప్పకుండానే పాకిస్తాన్ వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
టీం హోటల్‌కు చేరుకున్న తర్వాత కూడా బాబర్ ఎవరితోనూ మాట్లాడలేదని సమాచారం. అంతలోనే ఎవరికీ చెప్పా పెట్టకుండా పాకిస్తాన బయలుదేరాడట. సరిగ్గా వరల్డ్ కప్ ముందు ఇలా ఆ టీంలో గొడవలు జరగడం జట్టుకు ఏమాత్రం మంచిది కాదని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. పాకిస్తాన్ కనుక వరల్డ్ కప్‌లో రాణించాలంటే షహీన్ అఫ్రిదీ, బాబర్ ఆజమ్ ఇద్దరూ జట్టుకు చాలా ముఖ్యం.
ఆసియా కప్ ఆరంభంలో టీంమేట్స్ అందరికీ బాబర్ అండగా నిలబడ్డాడు. ఎవరైనా రాణించకపోయినా వాళ్లను డీమోటివేట్ చేయొద్దని డ్రెస్సింగ్ రూంలో అందరికీ చెప్పాడు. కానీ శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో బాబర్‌కు చిర్రెత్తుకొచ్చింది. వరల్డ్ కప్ ముందు పాకిస్తాన్ మరో సిరీస్ ఏదీ ఆడటం లేదు. ఈ క్రమంలో మళ్లీ ఈ టీంమేట్స్ అందరూ కూడా వరల్డ్ కప్‌లోనే కలవనున్నారు. ఇది ఆ జట్టుకు ఎంత పెద్ద సమస్యగా మారుతుందో చూడాలి.