ఆసియా కప్ ముందు చాలా మంది మాజీలు భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ స్థానం మార్చుకోవాలని సూచించారు. కోహ్లీ కనుక మూడు నుంచి నాలుగో నెంబర్‌కు మార్చుకుంటే.. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ముగ్గురు టాపార్డర్‌లో ఆడే ఛాన్స్ ఉంటుందని అన్నారు.
ఇక ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై 122 పరుగులతో కోహ్లీ చెలరేగాడు. అయితే ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై విఫలమయ్యాడు. ఓవరాల్‌గా మూడు ఇన్నింగ్సులు ఆడిన కోహ్లీ 64.50 సగటు, 114.15 స్ట్రైక్ రేటుతో 129 పరుగులు చేశాడు. గిల్ కూడా చెలరేగి 6 ఇన్నింగ్సుల్లో 302 పరుగులతో టోర్నీ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.

ఈ టోర్నీలో మూడో స్థానంలో తను ఎంత బెటర్ బ్యాటరో కోహ్లీ నిరూపించుకున్నాడని మాజీ ప్లేయర్ ఆకాష్ చోప్రా అన్నాడు. ఇకపై కోహ్లీ స్థానం మార్చుకోవాలనే కామెంట్స్ ఎవరూ చేయరని చెప్పాడు. 'ఈ టోర్నీ మొదలవడానికి ముందు రవిశాస్త్రి మాట్లాడుతూ కోహ్లీని నాలుగో నెంబర్‌లో పంపాలన్నాడు. అప్పుడు కిషన్, గిల్, రోహిత్ టాపార్డర్‌లో వస్తారని చెప్పాడు' అని చోప్రా గుర్తుచేశాడు.
'కోహ్లీని నాలుగో నెంబర్‌లో దించాలని చాలా మంది కూడా చెప్పారు. ఇప్పుడు కోహ్లీ స్థానం గురించి చర్చ ఉండదు. కిషన్ ఆడాలంటే నాలుగు లేదా ఐదో స్థానంలో వస్తాడు. ఎందుకంటే రోహిత్, గిల్, కోహ్లీ మన బెస్ట్ టాప్ త్రీ. వాళ్ల స్థానాలు టచ్ చేయడం కరెక్ట్ కాదు' అని చోప్రా స్పష్టం చేశాడు.
ఆసియా కప్‌లో ఫైనల్ మ్యాచ్ మినహా కిషన్ బ్యాటింగ్ చేసిన ప్రతిసారీ మిడిలార్డర్‌లోనే వచ్చాడు. పాకిస్తాన్‌పై చక్కని హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక ఫైనల్‌లో కేవలం 50 పరుగుల టార్గెట్ ఛేదించాల్సిన సమయంలో కిషన్ ఓపెనర్‌గా వచ్చాడు. గిల్, కిషన్ ఈజీగా టార్గెట్ ఛేజ్ చేయడంతో భారత జట్టు పది వికెట్ల తేడాతో ఫైనల్ నెగ్గి ట్రోఫీ ముద్దాడింది.