పాకిస్తాన్ ఓడితే ఏం జరుగుతుంది..?: పరువు కోసం - భారత్‌కు ఆ అడ్డు తొలగినట్టేనా?

షార్జా: యుఏ ఆసియా కప్ 2022 రసవత్తరంగా సాగుతోంది. రెండు మ్యాచ్‌లల్లో విజయాలతో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్తాన్, హాంకాంగ్‌లను ఓడించి నాలుగు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. గ్రూప్-బీలో ఆఫ్ఘనిస్తాన్ టాప్‌లో ఉంది. ఇప్పటివరకు ఓడిపోలేదీ జట్టు. ఆడిన రెండు మ్యాచ్‌లల్లో ప్రత్యర్థులను మట్టి కరిపించింది. ఈ పరిణామాలు టోర్నమెంట్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేశాయి.

షార్జాలో..
గ్రూప్-ఏలో ఇవ్వాళ బాబర్ ఆజమ్ నాయకత్వాన్ని వహిస్తోన్న పాకిస్తాన్.. హాంకాంగ్‌తో తలపడనుంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు గెలుపురుచి చూడని జట్లే ఈ రెండు కూడా. యూఏఈలోని షార్జా స్టేడియంలో మ్యాచ్ షెడ్యూల్ అయింది. భారత కాలమానం ప్రకారం- సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. పసికూనపై భారత్ ఇదివరకే తన ప్రతాపాన్ని చూపింది. ఇక పాకిస్తాన్ వంతు వచ్చింది.

పాక్‌కు చావో..రేవో..
పాకిస్తాన్‌కు ఇవ్వాళ్టి మ్యాచ్ చావో- రేవో అన్నట్లు తయారైంది. హాంకాంగ్‌పై ఓడిపోవడమంటూ జరిగితే పాకిస్తాన్ పరువు పోగొట్టుకున్నట్టే. ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అవుతుంది. రెండు మ్యాచ్‌లల్లో రెండు ఓటములతో ఇంటిదారి పడుతుంది. ఇప్పటికే భారత్ చేతిలో పరాజయాన్ని చవి చూసింది. ఎలిమినేషన్ అంచుల్లో నిలిచింది. హాంకాంగ్‌పైనా ఓడితే ఇక ప్యాకప్ చెప్పక తప్పదు. గెలిచి తీరాల్సిన మ్యాచ్ కావడం వల్ల పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

రెండు ఓటములతో..
గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇదే గ్రూప్‌లో ఉన్న పాకిస్తాన్ గానీ, హంకాంగ్ గానీ ఇంకా బోణీ చెయ్యలేదు. చెరో రెండు మ్యాచ్‌లల్లో ఓడాయి. భారత్ చేతిలో పరాభవం పొందిన ఈ రెండు జట్లు ఇవ్వాళ తలపడనున్నాయి. గెలిచిన జట్టు తదుపరి రౌండ్‌లో అడుగు పెడుతుంది. ఓడిన టీమ్.. ఇంటిదారి పట్టక తప్పదు.

పోరాడితే పోయేదేమీ లేదు..
హాంకాంగ్ మాత్రం పెద్దగా ఒత్తిళ్లను ఎదుర్కొనట్లేదు. ఆ జట్టుపై ఎలాంటి అంచనాలు లేవు. ఒక్క మ్యాచ్ గెలిస్తే అదే గొప్ప అనే స్థితిలో ఉందా టీమ్. అండర్ డాగ్‌గా ఈ టోర్నమెంట్‌లోకి అడుగు పెట్టింది. తన తొలి మ్యాచ్‌లో బలమైన భారత జట్టును తీవ్రంగా ప్రతిఘటించింది. పోరాట పటిమను ప్రదర్శించింది. భారత బౌలింగ్‌కు ధీటుగా స్పందించింది. 20 ఓవర్లల్లో 152 పరుగులు చేసింది. ఈ క్రమంలో అయిదు వికెట్లను మాత్రమే కోల్పోయింది.

బ్యాటింగే బలం..
శక్తిమంతమైన టీమిండియా బౌలర్లపై ఎదురుదాడి చేసి- ఓవర్‌కు ఏడుకు పైగా పరుగులు చొప్పున రాబట్టుకుంది హాంకాంగ్. టీ20 స్పెషలిస్ట్ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్‌ల బౌలింగ్‌లో 97 పరుగులు పిండుకుందంటే ఆ జట్టు బలమైన బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉన్నట్టే. అదే దూకుడును కొనసాగించగలిగితే- పాకిస్తాన్‌కు చుక్కలే. పాకిస్తాన్ ఓడితే - భారత జట్టుకు ఈ టోర్నమెంట్‌లో తిరుగు ఉండకపోవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications