Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Afghan vs Bangladesh : బంగ్లాను ఆఫ్ఘనిస్థాన్ చిత్తుగా ఓడించడానికి అయిదు కారణాలివే..!

Asia cup 2022: Top 5 Reasons Why Afghanistan Beat Bangladesh In Clinical Manner

ఆసియాకప్‌లో టఫెస్ట్ టీంగా ఆఫ్ఘనిస్థాన్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. వరుసగా శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై రెండు మ్యాచ్‌‌లు గెలిచిన ఆఫ్ఘన్ టీం ఈ టోర్నీలో గ్రూప్ బి టాపర్‌గా సూపర్-4‌కు అర్హత సాధించింది. బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ బ్యాటింగ్, బౌలింగ్లో తాము ఎంతటి దుర్భేద్యమైన టీమో చాటుకుంది. సమష్టిగా రాణించిన టీం.. 7వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. ఇకపోతే ఆఫ్ఘాన్ బ్యాటర్లు ఇబ్రహీమ్ జడ్రాన్(41 బంతుల్లో 4 ఫోర్లతో 42 నాటౌట్) సమయోచితంగా ఆడగా.. నజీబుల్లా జడ్రాన్ (17 బంతుల్లో ఫోర్, 6 సిక్స్‌లతో 43 నాటౌట్) సిక్సర్లతో విరుచుకుపడడంతో చివర్లో మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. బంగ్లాదేశ్ విధించిన 128 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘన్ చాలా సమర్థంగా చేదించి విజయం సాధించింది. ఇకపోతే ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ గెలవడానికి అయిదు ప్రధాన కారణాలను ఓ సారి పరిశీలిస్తే..

బ్యాటింగ్ ఎంచుకుని పెద్ద తప్పు చేసిన షకీబ్

బ్యాటింగ్ ఎంచుకుని పెద్ద తప్పు చేసిన షకీబ్

యూఏఈ పిచ్‌ల పరిస్థితి తెలిసి కూడా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పెద్ద మిస్టేక్ చేశాడు. టాస్ గెలిచిన అతను తొలుత బౌలింగ్ తీసుకోకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అదే ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణంలా మారింది. యూఏఈ పిచ్‌ల పరిస్థితి మేరకు ఇప్పటివరకు జరిగిన తొలి రెండు మ్యాచ్‌లలో టాస్ గెలిచిన ఆఫ్ఘన్, ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాయి. ఇక ఛేజింగ్లో గెలుపొందాయి. దీన్ని బట్టి టాస్ గెలిచిన జట్టుకు ఎడ్జ్ ఉంటుందనేది స్పష్టమవుతుంది. అయితే షకీబ్ మాత్రం అత్యుత్సాహంతో తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడంతో ఆఫ్ఘన్‌కు లక్ కలిసొచ్చి వరుసగా రెండోసారి ఛేజింగ్ టైంలో గెలుపొందింది.

టాపార్డర్ భరతం పట్టిన ముజీబ్ ఉర్ రెహ్మాన్

టాపార్డర్ భరతం పట్టిన ముజీబ్ ఉర్ రెహ్మాన్

ఆఫ్ఘన్ లెగ్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ బౌలింగ్లో నిప్పులు చెరిగాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు షాకుల మీద షాకులిచ్చాడు. తన మిస్టరీ స్పిన్ వేరియేషన్లతో క్రీజులో బ్యాటర్లు నిలబడాలంటేనే వణికేలా చేశాడు. తన తొలి స్పెల్‌లో బంగ్లా టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. అతని దెబ్బకు బంగ్లా ఓపెనర్లు నయిమ్ (6), అనాముల్ హక్ (5), కెప్టెన్ షకీబ్ (11) త్వరత్వరగా పెవిలియన్ బాట పట్టారు. షకీబ్ అల్ హసన్ క్లీన్ బౌల్డ్ కావడం గమనార్హం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ముజీబ్ నిలిచాడు.

పుండు మీద కారం చల్లినట్లు రషీద్ ఖాన్ బౌలింగ్

పుండు మీద కారం చల్లినట్లు రషీద్ ఖాన్ బౌలింగ్

అప్పటికే 24పరుగులకే 3వికెట్లు కోల్పోయిన బంగ్లాను ఆప్ఘాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఇక ఏమాత్రం కోలుకోనివ్వలేదు. అతను ముష్ఫీకర్ రహీమ్ (1)ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ పంపించేశాడు. దీంతో ఆఫ్ఘన్ పని సులువు అయింది. ఆ తర్వాత అఫీఫ్ హుస్సేన్ (12), మహమ్మదుల్లా (25) కాసేపు పోరాడినా వీరిద్దరి భరతం కూడా రషీద్ ఖాన్ పట్టాడు. దీంతో ఆ జట్టు మిడిలార్డర్ నిలదొక్కుకోలేదు. ఫలితంగా 89పరుగులకు 6వికెట్లు కోల్పోయింది. అయితే ఆ జట్టులో మొసద్దిక్ హుస్సేన్ (48నాటౌట్) చివరి దాకా క్రీజులో నిలబడ్డంతో బంగ్లా 127కు చేరుకుంది.

వికెట్ కాపాడుకుంటూ ఆడిన ఇబ్రహీం..

వికెట్ కాపాడుకుంటూ ఆడిన ఇబ్రహీం..

ఇక ఛేదనలో ఆఫ్ఘన్‌కు శుభారంభం దక్కలేదు. ఆ జట్టు ఏమాత్రం ఎటాక్ చేయలేకపోయింది. బంగ్లా స్పిన్నర్లు షకీబ్ అల్ హసన్ (4-0-13-1) ప్రదర్శనకు తోడు.. మొసద్దిక్ హోస్సేన్, మెహిదీ హసన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ఆ జట్టు పది ఓవర్లు ముగిసేసరికి 48పరుగులకు 2వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే అయినప్పటికీ ఇబ్రహీం జార్డన్ (42పరుగులు 41బంతుల్లో 4ఫోర్లు) వికెట్ కాపాడుతూనే ఆడాడు. కెప్టెన్ నబీ (8) కూడా ఔటవ్వడంతో 13 ఓవర్లకు 62పరుగులకే 3వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘన్ మరో వికెట్ చేజార్చుకోకుండా ఇబ్రహీం సమయోచితంగా ఆడాడు. మరో పక్క నజీబుల్లా ఎటాక్ చేస్తుండడంతో అతనికి స్ట్రైక్ తీసిచ్చాడు.

నజీబుల్లా విధ్వంసకాండ

నజీబుల్లా విధ్వంసకాండ

ఇక నబీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన నజీబుల్లా జార్డన్ (43పరుగులు 17బంతుల్లో 1ఫోర్, 6సిక్సర్లు) విధ్వంసకాండతో ఆఫ్ఘన్‌ను మరో 9బంతులు మిగిలి ఉండగానే గెలుపు గీత ధాటించాడు. స్పిన్నర్ల బౌలింగ్లో ఆచితూచి ఆడిన నజీబుల్లా.. పేసర్లు ముస్తాఫిజుర్, సైఫుద్దీన్ బౌలింగ్లో విధ్వంసకరంగా ఆడాడు. అతని ధాటికి పేసర్లు తేలిపోయారు. ఒకానొక దశలో బంగ్లా వైపే మ్యాచ్ ఉంది. 36బంతుల్లో 63పరుగులు చేయాల్సిన దశలో మ్యాచ్ ఉత్కంఠ వచ్చింది. అయితే నజీబుల్లా తన ప్రతాపాన్ని మొదలెట్టాడు. 16వ ఓవర్లో సిక్స్ కొట్టి తన హిట్టింగ్ ప్రారంభించిన అతను.. 17వ ఓవర్లో ముస్తాఫిజుర్ వేయగా రెండు సిక్సులు బాది 17పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత 18వ ఓవర్లో సైఫుద్దీన్ బౌలింగ్లో ఫోర్, రెండు సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్లో 22పరుగులొచ్చాయి. దీంతో గెలుపు సమీకరణం దగ్గరికొచ్చింది. 19వ ఓవర్ 3వ బంతికి స్పిన్నర్ బౌలింగ్లో సిక్స్ కొట్టి గెలుపు లాంఛనాన్ని నజీబుల్లా ముగించాడు.

Story first published: Wednesday, August 31, 2022, 12:18 [IST]
Other articles published on Aug 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+