For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సూపర్-4 బిగిన్స్..: ఆ అద్భుతాలు: ఆఫ్ఘన్‌పై లంకేయుల ప్రతీకార జ్వాల: తుదిజట్టులో..!!

Asia Cup 2022, Sri Lanka vs Afghanistan Playing 11: Super 4 stage from Group B details are here

షార్జా: ఆసియా కప్ మెగా టోర్నమెంట్‌లో ఇవ్వాళ్టి నుంచి సూపర్ 4 దశ మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. గ్రూప్-బీలో శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ తలపడబోతోన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 4కు చేరుకున్నాయి. బంగ్లాదేశ్, హాంకాంగ్ టోర్నీ నుంచి వైదొలిగాయి.

ఆసియా కప్ టోర్నమెంట్‌లో శ్రీలంకకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పటివరకు అయిదుసార్లు ఛాంపియన్‌గా అవతరించింది. భారత్ ఏడుసార్లు ఈ కప్ గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్ ఈ టోర్నమెంట్‌లో ఆడబోతోండటం ఇది మూడోసారి. అయినప్పటికీ- లంకేయులను మట్టి కరిపించింది ఆప్ఘన్ తన తొలి మ్యాచ్‌లో. ఇప్పుడు సూపర్ 4 దశలో ఈ రెండు జట్లు మరోసారి ఎదురుపడ్డాయి. ఆఫ్ఘనిస్తాన్‌పై లంక ప్రతీకారాన్ని తీర్చుకుంటుందా? లేక పరాజయాన్ని చవి చూస్తుందా? అనేది ఈ రాత్రికి తేలిపోతుంది.

శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌లో సమవుజ్జీలుగా కనిపిస్తోన్నాయి. ఈ మధ్యకాలంలో శ్రీలంక జట్టు అద్భుతంగా పుంజుకొంది. తన కంటే ఎంతో బలమైన ఆస్ట్రేలియాపై వరుస విజయాలను సాధించింది. తమదేశ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియన్లకు పరాజయాన్ని రుచి చూపించింది. ఇప్పుడదే ఊపుతో ఆసియా కప్‌లో ఎంట్రీ ఇచ్చింది గానీ.. బోణీ మ్యాచ్‌లోనే పరాజయం పాలైంది. ఆ తరువాత తేరుకుంది. బంగ్లాదేశ్‌పై 183 పరుగుల భారీ లక్ష్యాన్ని కొట్టి అవతల పడేసింది.

టీ20 స్పెషలిస్టులు పాథుమ్ నిశ్శంక, భానుక రాజపక్స, ఆల్ రౌండర్ వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, చరిత్ అసలంక.. వంటి ప్లేయర్లతో శ్రీలంక బలమైన జట్టుగా తయారైంది. గ్రూప్ దశలో ఆడిన రెండు మ్యాచ్‌లల్లో ఘన విజయాలతో సూపర్ 4లో అడుగు పెట్టింది ఆఫ్ఘనిస్తాన్. ఇప్పటివరకు ఓటమి చవి చూడలేదు. అదే పెర్ఫార్మెన్స్‌, దూకుడును సూపర్ 4 దశలో కూడా ప్రదర్శిస్తామని ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ ధీమా వ్యక్తం చేశాడు.

బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీ కొట్టాలంటే గ్రూప్ దశలో చేసిన పొరపాట్లను రిపీట్ చేయకూడదు శ్రీలంక. ఎక్స్‌ట్రా పరుగులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఆఫ్ఘనిస్థాన్‌ ఎలాంటి పొరపాట్లు చేయలేదు. ఆఫ్ఘన్‌కు పరాజయాన్ని చవి చూపించాలంటే నిఖార్సయిన క్రికెట్ ఆడాల్సి ఉంటుందని, ఆ జట్టును అంత తేలిగ్గా తీసుకోవట్లేదని డాసన్ షనక చెప్పాడు.

శ్రీలంక తుదిజట్టులో- పాథుమ్ నిశ్శంక, ధనుష్క గుణతిలక, భానుక రాజపక్స, చరిత్ అసలంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), డాసన్ శనక (కేప్టెన్), వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, చమిక కరుణరత్నె, అసిత ఫెర్నాండో, దిల్షన్ మదుషంక ఆడే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌లో- హజ్రతుల్లా జరాయ్, రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నజీబుల్లా జడ్రాన్, ఇబ్రహీం జడ్రాన్, మహ్మద్ నబీ (కేప్టెన్), రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్, నవీనుల్ హక్, నూర్ అహ్మద్, కరీం జనత్, ఫజల్ హక్ ఫారూఖీ ఆడొచ్చు.

Story first published: Saturday, September 3, 2022, 7:16 [IST]
Other articles published on Sep 3, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+