Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2022: తొలి మ్యాచ్‌కు సర్వం సిద్ధం: బోణి కొట్టేదెవరో గానీ: తుదిజట్టు అంచనాలివే..!!

Asia Cup 2022: Sri Lanka vs Afghanistan Playing 11 details inside

అబుధాబి: ఎప్పుడెప్పుడా అంటూ ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తోన్న ఆసియా కప్ మెగా టోర్నమెంట్ వచ్చేసింది. ఇవ్వాళ తొలి మ్యాచ్ ఆరంభం కాబోతోంది. గ్రూప్-బీలో శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ తలపడబోతోన్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్, గ్రూప్-బీలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది.

నిజానికి- షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నమెంట్‌ను శ్రీలంక నిర్వహించాల్సి ఉంది. అక్కడ నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీన్ని యుఏఈకి షిఫ్ట్ చేసింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. ఆసియా కప్ టోర్నమెంట్‌లో శ్రీలంకకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పటివరకు అయిదుసార్లు ఛాంపియన్‌గా అవతరించింది. భారత్ ఏడుసార్లు ఈ కప్ గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్ ఈ టోర్నమెంట్‌లో ఆడబోతోండటం ఇది మూడోసారి.

శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌లో సమవుజ్జీలుగా కనిపిస్తోన్నాయి. ఈ మధ్యకాలంలో శ్రీలంక జట్టు అద్భుతంగా పుంజుకొంది. తన కంటే ఎంతో బలమైన ఆస్ట్రేలియాపై వరుస విజయాలను సాధించింది. తమదేశ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియన్లకు పరాజయాన్ని రుచి చూపించింది. ఇప్పుడదే ఊపుతో ఆసియా కప్‌లో ఎంట్రీ ఇవ్వబతోంది. టీ20 స్పెషలిస్టులు పాథుమ్ నిశ్శంక, భానుక రాజపక్స, ఆల్ రౌండర్ వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, చరిత్ అసలంక.. వంటి ప్లేయర్లతో శ్రీలంక బలమైన జట్టుగా తయారైంది.

టీ20 ఫార్మట్‌లో శ్రీలంక తరఫున లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉంటోన్నాడు పాథుమ్ నిశ్శంక. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లను ఆడిన అతను 326 పరుగులు చేశాడు. భానుక రాజపక్స భారీ షాట్లతో విరుచుకుపడగలడు. డిస్ట్రక్టివ్ బ్యాటర్ అతను. నిలకడలేమి అతణ్ని వేధిస్తోంది. టీ20 ఫార్మట్‌లో 134.61 స్ట్రైక్‌రేట్‌తో దూసుకెళ్తోన్నాడు భానుక. ఆల్ రౌండర్ వనిందు హసరంగా ఎలాంటి బ్యాటర్‌నయినా కట్టిపడేయగలడు. 32 మ్యాచ్‌లల్లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

శ్రీలంక తుదిజట్టులో- పాథుమ్ నిశ్శంక (వికెట్ కీపర్), ధనుష్క గుణతిలక, భానుక రాజపక్స, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, డాసన్ శనక (కేప్టెన్), వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, చమిక కరుణరత్నె, అసిత ఫెర్నాండో, జెఫ్రీ వాండెర్సే ఆడే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌లో- నజీబుల్లా జడ్రాన్, హజ్రతుల్లా జరాయ్, ఇబ్రహీం జడ్రాన్, ఉస్మాన్ ఘని, రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), మహ్మద్ నబీ (కేప్టెన్), రషీద్ ఖాన్, ముజీబుర్ రెహ్మాన్, నవీనుల్ హక్, నూర్ అహ్మద్, కరీం జనత్ ఆడొచ్చు.

Story first published: Saturday, August 27, 2022, 8:03 [IST]
Other articles published on Aug 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+