
బౌలింగ్ అధ్వాన్నం..
బంగ్లాదేశ్ పరిస్థితి అధ్వాన్నం. అంచనాలకు ఏ మాత్రం అందని విధంగా సాగిందీ జట్టు ఆటతీరు. శ్రీలంకపై జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో రాణించినప్పటికీ- బౌలింగ్ కొంప ముంచింది. నాసిరకం బౌలింగ్‌తో పరాజయాన్ని కోరి తెచ్చుకుంది. 183 పరుగులను కాపాడుకోలేక చేతులెత్తేశారు బంగ్లా బౌలర్లు. చివరి ఓవర్ వరకూ సాగిన ఈ హైటెన్షన్ మ్యాచ్‌లో లంకేయులు విజయం సాధించారు. చివరి వరకు పట్టు వదలకుండా పోరాడారు.

17 ఎక్స్‌ట్రాలు..
ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్లు ఏకంగా 17 ఎక్స్‌ట్రాలను సమర్పించుకోవడం టర్నింగ్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. బంగ్లా పాలిట అవే విలన్‌గా మారాయి. టీ20 ఫార్మట్‌లో 17 ఎక్స్‌ట్రాలంటే ఆ జట్టు బౌలింగ్ సత్తా ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇందులో అయిదు లెగ్‌బైస్, నాలుగు నో బాల్స్ ఉంటే.. ఎనిమిది వైడ్స్ ఉన్నాయి. బౌలర్లు బంతులను సంధించిన తీరు పట్ల కేప్టెన్ షకీబుల్ హసన్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు.

స్పిన్నర్లు నో బాల్ వేయడం..
స్పిన్నర్లు నో బాల్ వేయ్యడం అంటే అతి పెద్ద క్రైమ్ చేసినట్టేనని వ్యాఖ్యానించాడు. ఫాస్ట్ బౌలర్లు రిథమ్, లైన్ అండ్ లెంగ్త్‌ను అందిపుచ్చుకోవడంలో వైడ్స్ పడుతుంటాయని, అవే వైడ్ బంతులను స్పిన్నర్లు సంధించడంలో అర్థం లేదని పేర్కొన్నాడు. తమ ఓటమికి ప్రధాన కారణంగా ఎక్స్‌ట్రాలేనని చెప్పుకొచ్చాడు. వైడ్స్, లెగ్‌బైస్, నో బాల్స్ విస్తృతంగా పడ్డాయని, ఓ టీ20 ఫార్మట్‌లో ఇలాంటివి ఏ జట్టు విజయావకాశాలనైనా దెబ్బతీస్తాయని అన్నాడు.

ఎక్స్‌ట్రాలతోనే విక్టరీ..
షకీబుల్ హసన్ ఆవేదనకు అర్థం లేకపోలేదు. చివరి రెండు ఓవర్లల్లో 25 పరుగుల చేయాల్సిన దశలో బంగ్లాదేశ్ బౌలర్లు ఎక్స్‌ట్రాలు వేశారు. 19వ ఓవర్‌లో ఏకంగా ఎనిమిది బంతులు వేయాల్సి వచ్చింది. ఇబాదత్ హసన్ వేసిన ఓవర్ అది. మూడో బంతి నో బాల్ ప్లస్ ఫోర్‌గా వెళ్లింది. దీనితో అయిదు ఎక్స్‌ట్రాగా వచ్చాయి. ఫ్రీ హిట్ అదనం. నాలుగో బంతి లెగ్‌బై. అయిదో బంతికి వికెట్ పడినప్పటికీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఆరోమంతి మళ్లీ వైడ్. ఎక్స్‌ట్రా బంతిని అసిత ఫెర్నాండో ఫోర్‌గా మలిచాడు. దీనితో ఆ ఓవర్‌లో 17 పరుగులొచ్చాయి శ్రీలంకకు.

చివరి ఓవర్‌లో..
చివరి ఆరు బంతుల్లో ఎనిమిది పరుగులు చేయాల్సిన దశలోనూ బంగ్లాదేశ్ బౌలర్ మెహదీ హసన్ ఎక్స్‌ట్రాలు ఇచ్చాడు. తొలి బంతి లెగ్‌బై కాగా.. రెండో బంతికి అసిత ఫెర్నాండో ఫోర్ బాదాడు. మూడో బంతిన మళ్లీ నో బాల్‌గా పడింది. అక్కడే మ్యాచ్ ఖతమైంది. శ్రీలంక జట్టు సూపర్-4కు క్వాలిఫై కాగా.. బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి వైదొలగింది.


Click it and Unblock the Notifications












