
రెండు ఓటములతో..
అదే దూకుడుతో హాంకాంగ్‌ను ఓడించడంతో అంచనాలు మిన్నంటాయి. ఇదంతా- ఆసియా కప్ 2022 టోర్నమెంట్ గ్రూప్ దశ ముగిసేంత వరకే. సూపర్ 4లో టీమిండియా ఆడిన రెండు మ్యాచ్‌లు అతణ్ని పాతాళానికి తొక్కేశాయి. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే.. నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే.. అనడానికి రోహిత్ శర్మ ప్రత్యక్షసాక్షిగా నిలిచాడు. ఆసియా కప్ 2022 ఫైనల్స్ చేరాలంటే గెలిచిన తీరాల్సిన రెండు సూపర్ 4 మ్యాచ్‌లల్లోనూ ఘోరంగా ఓడింది భారత్.

స్పోర్టివ్‌గా..
ఈ రెండు మ్యాచ్‌లో ఓటమి ప్రభావం ఇప్పుడు రోహిత్ శర్మపై పడుతోంది. ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ శర్మ స్పోర్టివ్‌నెస్ కోల్పోతోన్నాడని, ఫీల్డ్‌లో వ్యక్తిగతంగా అగ్రెసివ్‌నెస్ కనపర్చుతున్నాడని అంటున్నారు. ఇది ఏమంత మంచిది కాదని స్పష్టం చేస్తోన్నారు. ప్రత్యర్థిని ఓడించడంలో, బౌలింగ్‌ను తుత్తునీయలు చేయడంలో చూపించాల్సిన దూకుడు వైఖరిని సొంత జట్టు ప్లేయర్ల మీద ప్రదర్శిస్తోన్నాడని చెబుతున్నారు.

ఫీల్డ్‌లో అన్‌కంఫర్టబుల్..
ఫీల్డ్‌లో రోహిత్ శర్మ అన్‌కంఫర్టబుల్‌గా ఉంటోన్నాడని పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అఖ్తర్ వ్యాఖ్యానించాడు. గట్టిగా అరుస్తూ కనిపిస్తోన్నాడని, ఇది మంచిది కాదని చెప్పాడు. రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్ క్యాచ్‌లు డ్రాప్ చేసిన తరువాత రోహిత్ శర్మ ప్రదర్శించిన ఆగ్రహావేశాలు, అగ్రెసివ్‌నెస్- టీమిండియా క్యాంప్‌లో అస్థిరతకు దారి తీస్తుందని అంచనా వేశాడు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు ుందు అలాంటి పరిస్థితులు ఏ జట్టుకు కూడా మంచిది కాదని పేర్కొన్నాడు.

మరీ అంత అధ్వాన్నంగా..
ఆసియా కప్‌లో టీమిండియా మరీ అంత అధ్వాన్నంగా ఆడిందని తాను అనుకోవట్లేదని షోయబ్ అఖ్తర్ చెప్పాడు. అంచనాలకు అనుగుణంగా ఆడలేకపోయారంతేనని అన్నాడు. నేలకు రాలిన ప్రతీసారీ భారత జట్టు మల్లీ అదే వేగంతో పైకి లేస్తుందని, టీ20 ప్రపంచకప్‌కు సన్నాహాలు చేస్తుందని చెప్పాడు. ఈ ఓటముల నుంచి గుణపాఠాలను నేర్చుకోవాల్సిన అవసరం జట్టుకు ఉందని, తుదిజట్టులో ఎలాంటి ప్లేయర్లను తీసుకోవాలనడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పాడు.


Click it and Unblock the Notifications












