రోహిత్ శర్మ-కార్తీ-రష్మిక మందన్న: అద్దిరిపోయే కాంబో-పాన్ ఇండియా మూవీ: ట్రైలర్ రిలీజ్

ముంబై: భారత క్రికెట్ జట్టు కేప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఆసియా కప్ 2022 టోర్నమెంట్ ఆడుతున్నాడు. జట్టుతో పాటు అతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటోన్నాడు. అతని కేప్టెన్సీలో రెండు వరుస విక్టరీలను సాధించింది టీమిండియా. మలి దశ రౌండ్‌లో అడుగు పెట్టింది. పాకిస్తాన్, హాంకాంగ్‌పై ఆడిన మ్యాచ్‌లల్లో విజయాలతో గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచింది. తన తరువాతి మ్యాచ్‌ను ఆదివారం ఆడాల్సి ఉంది.

బాంబు పేల్చిన రోహిత్ శర్మ
ఈ పరిస్థితుల మధ్య రోహిత్ శర్మ సడన్‌గా బాంబు పేల్చాడు. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. మెగా బ్లాక్‌బస్టర్ అనే మూవీలో లీడ్ క్యారెక్టర్‌లో నటిస్తోన్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్ విడుదలైంది. టైట్ ఫిట్ హాఫ్ షర్ట్‌తో- సాఫ్ట్‌వేర్ గెటప్‌లో కనిపించాడు రోహిత్ శర్మ. ఎల్లుండి ట్రైలర్ లాంచ్ కానుంది. ఒహ్సీమ్ ఈ సినిమాను సమర్పిస్తోంది. అంతకంటే ఎక్కువ వివరాలు ఈ ఫస్ట్‌లుక్‌లో లేవు గానీ.. క్యూరియాసిటీని మాత్రం క్రియేట్ చేయగలిగింది.

పాన్ ఇండియా మూవీగా..
మల్టీ స్టారర్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిందీ మూవీ. తమిళ్ స్టార్ హీరో కార్తి, బీసీసీఐ ఛైర్మన్, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, రష్మిక మందన్న, త్రిష ఇందులో నటిస్తోన్నారు. ది కపిల్ శర్మ టాక్ షో ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కపిల్ శర్మ ఈ మూవీకి కర్త-కర్మ-క్రియగా వ్యవహరించారు. రోహిత్ శర్మతో పాటు, కార్తీ, సౌరవ్ గంగూలి, రష్మిక మందన్న, త్రిష ఫస్ట్ లుక్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్నాయి.

కపిల్ శర్మ ప్రాజెక్ట్..
వీటిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్నారు. అది అసలు మూవీ కాకపోవచ్చని అంచనా వేస్తోన్నారు. టెలివిజన్ షో అయ్యుండొచ్చని చెబుతున్నారు. లేదా ఏదైనా అడ్వర్టయిజ్‌మెంట్ కోసం స్టార్ క్యాస్ట్ మొత్తం ఇలా కనిపిస్తోందనీ చెబుతున్నారు నెటిజన్లు. సోనీ టీవీతో సుదీర్ఘకాలంగా అసోసియేట్ అయివున్నాడు కపిల్ శర్మ. మొన్నీ మధ్య కాంట్రాక్ట్‌ను ముగించుకున్నాడు. ఓటీటీ కోసం టాక్ షోలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించాడు. మళ్లీ బ్యాక్ టు పెవిలియన్ అయ్యాడు. సోనీలో రీ ఎంట్రీ ఇచ్చాడు.

హైప్ క్రియేట్..
సోనీ టీవీలో తన కమ్ బ్యాక్ కోసం మెగా బ్లాక్‌బస్టర్ పేరుతో టాక్ షోను నిర్వహిస్తోన్నాడని చెబుతున్నారు నెటిజన్లు. దీనిపై ఓ క్లారిటీ రావాలంటే.. ఎల్లుండి విడుదల కాబోతోన్న ట్రైలర్ కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ లుక్ పోస్టర్లల్లో ట్రైలర్ రిలీజ్ డేట్ తప్ప మరే ఇతర వివరాలను వెల్లడించకపోవడం ఈ మెగా బ్లాక్‌బస్టర్‌పై హైప్ క్రియేట్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications