Asia cup 2022 : గాయంతో దూరమైన పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది స్థానంలో.. !

పాకిస్థాన్ జట్టు స్టార్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన షాహీన్ అఫ్రిది గాయం కారణంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. శ్రీలంక పర్యటనలో మోకాలి గాయం కారణంగా షాహీన్ అఫ్రిది వైదొలగక తప్పలేదు. ఆసియా కప్ మాత్రమే కాదు ఇంగ్లాండ్‌తో జరగబోయే తదుపరి 7మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా అఫ్రిది దూరం కానున్నాడు. ఇకపోతే ఇంగ్లాండ్‌లోని ది హండ్రెడ్ లీగ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ తరఫున ఆడుతున్న మహ్మద్ హస్నైన్.. షాహీన్ అఫ్రిది స్థానంలో జట్టులోకి ఎంపికయ్యాడు. అతను యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి నేరుగా వచ్చి పాకిస్థాన్ జట్టులో చేరనున్నాడు. 22ఏళ్ల హస్నైన్ పాకిస్థాన్ తరఫున 18 టీ20లు ఆడాడు. అలాగే 17వికెట్లు తీశాడు. షాహీన్ గాయపడ్డంతో పాకిస్థాన్ బౌలింగ్ యూనిట్లో స్టార్ పేసర్ కొరత నెలకొంది. ఈ క్రమంలో అతని ప్లేస్‌లో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన హోస్నైన్ అంచనాలను ఏమేరకు ఫుల్ ఫిల్ చేస్తాడో. ఈ అవకాశం హోస్నైన్‌కు పెద్ద పరీక్ష అనే చెప్పాలి.

నెదర్లాండ్స్‌పై 3-0 తేడా వన్డే సిరీస్ గెలిచిన పాక్
కాగా ఆసియాకప్‌కు ఎంపికైన ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్, ఉస్మాన్ ఖాదిర్ మంగళవారం దుబాయ్ వెళ్లనున్నారు. నెదర్లాండ్స్‌తో జరిగిన 16మంది సభ్యుల వన్డే జట్టులో భాగమైన అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ హరీస్, సల్మాన్ అలీ అఘా, జాహిద్ మెహమూద్‌ల స్థానంలో వీరు ఎంపికయ్యారు. ఇక బాబర్ ఆజామ్ నేతృత్వంలోని మిగిలిన పాకిస్తాన్ జట్టు నెదర్లాండ్స్ నుంచి యూఏఈకి బయలుదేరుతుంది. నెదర్లాండ్స్‌పై మూడు వన్డేల సిరీస్‌ను 3-0తేడాతో పాకిస్థాన్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.

అదే జరిగితే మూడు భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌లు
ఆసియాకప్ తొలి రోజు తర్వాత రెండో రోజైన ఆగస్ట్ 28న దుబాయ్‌లో పాకిస్థాన్.. తమ ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్‌లో తన చిరకాల ప్రత్యర్థి అయిన భారత్‌తో తలపడుతుంది. సెప్టెంబర్ 2న శుక్రవారం జరిగే తమ రెండో గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లో క్వాలిఫైయర్ జట్టుతో తలపడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2జట్లు సూపర్ ఫోర్‌కు అర్హత సాధిస్తాయి. ఇక పాక్, ఇండియా గ్రూప్ 4కు చేరుకోవడం దాదాపు ఖాయం. ఇక సెప్టెంబర్ 3 నుంచి 9 వరకు సూపర్ ఫోర్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక సూపర్ 4లో ప్రతి జట్టు మరో మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అంటే సూపర్ 4 స్టేజ్‌లో కూడా ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ ఉంటుంది. ఇక సూపర్ 4లో టాప్ 2లో నిలిచిన రెండు జట్లు ఫైనల్ ఆడతాయి. ప్రస్తుతం పరిస్థితుల ప్రకారం.. టీమిండియా, పాకే ఆ స్థానాల్లో నిలిచేందుకు అవకాశాలున్నాయి. అదే జరిగితే ఫైనల్లో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ ఉంటుంది. దీన్ని బట్టి.. ఒకే టోర్నీలో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్‌లు మూడు జరిగేందుకు అవకాశాలున్నాయి.

ఆసియాకప్‌కు ఎంపికైన పాకిస్థాన్ జట్టు
బాబర్ ఆజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షానవాజ్ దహన్ ఉస్మాన్ ఖాదిర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications