
నెదర్లాండ్స్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు అలాగే ఆసియా కప్ టోర్నీ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్లను ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ హసన్ అలీని జట్టులోంచి తీసేయడం గమనార్హం. అతనికి కొన్ని రోజులు విరామం ఇస్తున్నట్లు పాక్ బోర్డు పేర్కొంది. అతని స్థానంలో నసీమ్ షా ఎంపికయ్యాడు. నసీమ్ షా శ్రీలంకతో జరిగిన టెస్ట్ క్రికెట్ సిరీస్లో రాణించిన సంగతి తెలిసిందే. అతను వన్డేలు, టీ20లలో ఇప్పటివరకు ఆడలేదు. గాయం కారణంగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టుకు దూరమైన షాహీన్ షా అఫ్రిది తుది జట్టులోకి వచ్చాడు. బాబర్ అజామ్ నెదర్లాండ్ అలాగే ఆసియా కప్‌కు ఎంపిక చేసిన రెండు జట్లకు నాయకత్వం వహించబోతున్నాడు. దేశవాళీ టోర్నీల్లో అంచనాలకు తగ్గట్టుగా రాణించడంతో సల్మాన్ అలీ ఆఘా కూడా వన్డే జట్టులోకి రీకాల్ చేయబడ్డాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్‌తో ఆగస్టు 28న పాకిస్థాన్ తలపడనుంది. అంతకుముందు ఆగస్టు 16నుంచి 21వరకు నెదర్లాండ్స్‌తో మూడు వన్డేలను ఆ జట్టు ఆడబోతుంది.
నెదర్లాండ్స్‌తో వన్డేలకు ఎంపికైన పాకిస్థాన్ జట్టు
బాబర్ ఆజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్, అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇమామ్-ఉల్-హక్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సల్మాన్ అలీ అఘా, షాహీన్ షా ఆఫ్రి , షానవాజ్ దహానీ, జాహిద్ మెహమూద్
ఆసియా కప్ టోర్నీకి ఎంపికైన పాకిస్థాన్ జట్టు
బాబర్ ఆజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, షానవాజ్ ఖానీ, ఉస్మాన్ దహానీ