India vs Pakistan : గర్ల్ ఫ్రెండ్స్.. ప్లీజ్ బాయ్స్‌ను ఈరోజు వదిలేయండి..! ముందు మ్యాచ్ తర్వాతే మీరు

దుబాయ్: ఆసియాకప్ మెగా టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇక నేడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఈ టోర్నీలో తలపడనున్నాయి. ఈ సాయంత్రమే దుబాయ్ స్టేడియంలో 7:30గంటలకు ఈ హైఓల్టేజ్ మ్యాచ్ ఆరంభం కానుంది. రోహిత్ సేన - బాబర్ ఆజామ్ సేన బరిలోకి దిగనున్నారు. ఈ మ్యాచ్ కోసం యావత్ భారత క్రికెట్ ప్రేమికులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక నెట్టింటా ఇప్పటికే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ గురించి పోస్టులు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి.
ఇరు దేశాల అభిమానులు ఎంతో భావోద్వేగంతో ఈ మ్యాచ్ వీక్షిస్తుంటారు. మ్యాచ్ టైంలో టీవీలకు అతుక్కుపోతుంటారు. ఈ రోజు మ్యాచ్ వీక్షించే సమయంలో ఏమాత్రం డిస్ట్రబ్ చేసినా అభిమానులు చాలా సీరియస్ అవుతుంటారు. ఈ క్రమంలో నెట్టింటా ఈ విషయమై కొన్ని ఫన్నీ పోస్టులను నెటిజన్లు పోస్టు చేశారు.
గర్ల్ ఫ్రెండ్స్ గమనించండి
ఇకపోతే ఎప్పుడూ ఫోన్లో సొల్లు కబుర్లు పెట్టే బాయ్‌ఫ్రెండ్స్ ఇవాళ మాత్రం ఫుల్లు బిజీగా ఉంటాడు. గర్ల్ ఫ్రెండ్స్ ఈ విషయాన్ని కాస్త గమనించాలి. నాకంటే మ్యాచే ఎక్కువ అనే సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టినా వేస్టే.. ముందు మ్యాచ్ తర్వాతే నువ్వు అని బాయ్‌ఫ్రెండ్ అనడం ఖాయం.. కాబట్టి అంత మాట అనేదాక చూసుకోకండి. సండే సాయంత్రం సరదాగా బయటికి తీసుకెళ్లే భర్త ఈరోజు ఉలకడు పలకడు అని భార్యలు చిన్నబుచ్చుకోకండి.. మ్యాచ్ ఉందని అడ్జస్ట్ చేసుకోండి. సండే రోజు ఎప్పటిలాగే సినిమాకు గానీ ఎగ్జిబిషన్‌కు గానీ తీసుకెళ్లే ఫాదర్ టైం అవుతున్నా రెడీ కావట్లేదేంటని కూతుళ్లు అలగకండి.. డాడీకి ఎంటర్‌టైన్ మెంట్ అసైన్‌మెంట్ ఉందని వదిలేయండి.
పొరపాటున ఛానల్ పెట్టే సాహసం కూడా చేయొద్దు
తాతలు, బామ్మలు పొరపాటున కూడా మనమలకు చిన్నచిన్న పనులు చెప్పకండి.. కులాసాగా ఉండేవాళ్లు కుంపటిలా బిహేవ్ చేస్తారు. చెల్లెల్లు, అక్కయ్యలు పొరపాటున రిమోట్ పట్టుకుని వేరే ఛానల్ పెట్టే సాహసం చేయకండి.. అన్నయ్యలు, తమ్ముళ్లు అగ్గిమీద గుగ్గిలమంటే ఏంటో చూపిస్తారు. ఏదేమైనా ఈ రోజు సారీ వర్క్, సారీ గర్ల్స్, సారీ ఫ్యామిలీ.. బికాస్ ఆఫ్ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్. దీని గురించే ఓ నెటిజన్ చాలా బ్రీఫ్‌గా ఓ పోస్ట్ పెట్టాడు.
పూజ సరిగా చేయకపోతే హెల్ప్ చేయండి
ఇకపోతే ఎన్నడూ కూడా ఇంట్లో పూజాగదిలోకి వెళ్లని మీ అబ్బాయి గానీ భర్తగానీ పూజాగదిలో పూజా చేస్తుంటే ఆశ్చర్యపడకండి.. పూజలు, పునస్కారాలు చేయడమే కాకుండా లోలోపల గొణుగుతూ మరీ మీ వాళ్లు దేవుణ్ని ఈరోజు తలుచుకుంటుంటారు.. జాబ్ రావాలనో, ప్రమోషన్ కోసమో కాదు.. ఇండియా గెలవాలని. అందువల్ల వాళ్లు తెలిసో తెలియక పూజ సరిగ్గా చేయకపోతే కాస్త హెల్ప్ చేయండి.. గానీ వారికి అవగాహన లేని పూజా విధానాన్ని చూసి విసుక్కోకండి. ఒకటి మాత్రం చేయండి.. టీవీ ముందు హారతి ఇవ్వడం, టీవీ సైడ్ హోల్స్‌లో అగరబత్తులు పెట్టడం లాంటివి చేయకుండా చూడండి చాలు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications