Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2022: వకార్ యూనిస్‌కు ఇచ్చిపడేసిన నెటిజన్లు.. షాహీన్ అఫ్రిది తోపైతే.. మావోళ్లు తోపులకే తోపులు!

 Asia Cup 2022: Netizans Slams Waqar Younis for His controversy Tweet

ఆసియా కప్ 2022కి పాకిస్థాన్ స్టార్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది దూరమైన సంగతి తెలిసిందే. ఈ విషయమై పాకిస్థాన్ లెజెండరీ పేసర్ వకార్ యూనిస్ చేసిన ట్వీట్ నెట్టింట విపరీతంగా ట్రోల్ అవుతుంది. షాహీన్ అఫ్రిది లేకపోవడంతో భారత టాపార్డర్ బతికిపోయారనేలా వకార్ యూనిస్ ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు ఓ రేంజులో వకార్ యూనిస్‌పైకి ఎక్కేశారు. కొందరు కామెంట్లతో కుంపటి రాజేస్తే.. మరికొందరు మీమ్స్, పోస్టులతో ఇచ్చిపడేశారు. వంకరగా మాట్లాడి పరువు పోగొట్టుకోకు వకార్.. ఇన్ ఫ్రంట్ దెర్ ఇజ్ ఏ బిగ్ క్రొకడైల్ ఫెస్టివల్ అంటూ చురకలంటించారు. ఇక భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం అందుకున్నాడు. షాహీన్ అఫ్రిది దూరమైతే భారత టాపార్డర్‌కు పెద్ద ఇబ్బందేం ఉండదని.. మా పేసు గుర్రం బుమ్రా మిస్సవ్వడమే పాకిస్థాన్‌తో సహా మిగతా జట్లు అన్నింటికీ బిగ్ రిలీఫ్ అని ట్వీట్ చేశాడు.

వకార్ యూనిస్ ఏమని ట్వీట్ చేశాడంటే..

మోకాలి స్నాయువు గాయం కారణంగా షాహీన్ అఫ్రిది ఆసియా కప్‌కు దూరం కానున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. షాహీన్ గాయాన్ని ప్రస్తావిస్తూ.. ఆసియా కప్‌ టోర్నీకి ఫాస్ట్ బౌలర్ అయిన షాహీన్ షా అఫ్రిది అందుబాటులో లేకపోవడం చాలా బాధగా ఉంది. షాహీన్ గాయంతో దూరమవ్వడం భారత టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌కు అతి పెద్ద రిలీఫ్. అతన్ని #AsiaCup2022లో చూడలేకపోవడం విచారకరం. త్వరలోనే అతను గాయం నుంచి కోలుకుని ఫిట్ నెస్ సాధించాలని కోరుతున్నాను.' అని వకార్ యూనిస్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీటే ట్రోల్స్‌కు కారణమైంది.

చెప్పకనే అన్ని చెప్పేశావంటూ..

షాహీన్ ఆఫ్రిది లేకుంటే ఇండియా టాపార్డర్‌కు రిలీఫ్ అంటున్నావ్ కదా.. అంటే దాని అర్థం ఏంటీ. షాహిన్ అఫ్రిది బౌలింగ్లో మిడిలార్డర్ బ్యాటర్లు తుక్కురేగడతారనా..? లేక షాహీన్ అఫ్రిది తప్పా మిగతా పాక్ బౌలర్లు ఎవరు పనికిరారనా.. లేక వాళ్లు భారత బ్యాటింగ్ దెబ్బకు బలికావాల్సిందే గానీ ఏం పీకలేరనా? అలాంటప్పుడు మిగతా అయిదారుగురు బౌలర్లను ఆసియా కప్ కోసం యూఏఈకి ఎందుకు పంపించడం అంటూ ఓ నెటిజన్ వకార్ యూనిస్‌ను సూటిగా ప్రశ్నించాడు. మరో నెటిజన్.. ఒక్క బౌలర్ లేకుంటే మీ పని తుస్ అని నువ్వే ఒప్పుకున్నావ్.. కానీ మా ఇండియాలో ఒక్క బౌలర్ లేకున్నా మస్తు మంది బౌలర్లు తుక్కురేగ్గొడతారు.. అందుకే పాకిస్థాన్‌పై భారత్ ఎప్పుడు పైచేయే సాధిస్తుందని పేర్కొన్నాడు.

అజయ్ జడేజా ఇచ్చిన స్ట్రోక్ సరిపోలేదా?

కొందరైతే వకార్ యూనిస్‌ దిమాక్ సరిగా పనిచేస్తలేదు కావొచ్చు. 1996 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో వకార్ యూనిస్ బౌలింగ్‌ను అజయ్ జడేజా ఎలా చిత్తు చేశాడో మర్చిపోయాడేమో.. షాహీన్ షా అఫ్రిది అయితే ఏంటీ వాడి తాత అయితే ఏంటీ.. పవర్ ప్యాక్ లాంటి రోహిత్ శర్మ ముందు ఎవడైనా బేజారే అంటూ కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. షాహిన్ అఫ్రిది తోపు అయితే.. రోహిత్ శర్మ తోపులకే తోపు అనేలా షాహిన్ బౌలింగ్లో రోహిత్ వీరబాదుడుకు సంబంధించి ఓ వీడియో కూడా నెట్టింట వైరలవుతుంది. అలాగే షాహిన్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ సిక్స్ కూడా ట్రెండ్ అవుతుంది. ఇకపోతే కొందరు వకార్ యూనిస్ ఎందుకిలా పరువు పొగొట్టుకుంటావ్.. టీ20 ప్రపంచకప్‌కు అందుబాటులోకి వస్తాడుగా.. అప్పుడు చూద్దువుగానీ మీ షాహీన్ షా అఫ్రిది గొప్ప ప్రదర్శన.. ఓ పెద్ద పోటుగాడంటూ బిల్డప్ అని వకార్ పై సీరియస్ అవుతున్నారు. మరీ వకార్ యూనిస్ వ్యాఖ్యలపై మీరేమంటారు..?

Story first published: Sunday, August 21, 2022, 20:15 [IST]
Other articles published on Aug 21, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+