
అబుధాబి: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఆసియా కప్ మెగా టోర్నమెంట్ వచ్చేసింది. ఆసియాకు చెందిన దేశాలు ఇందులో పోటీ పడుతున్నాయి. ఇవ్వాళ తొలి మ్యాచ్ ఆరంభం కాబోతోంది. గ్రూప్-బీలో శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ తలపడబోతోన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది.
గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్, గ్రూప్-బీలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఢీ కొనబోతోన్నాయి. ఇదే దుబాయ్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా బాబర్ ఆజమ్ సేనతో తలపడనుంది. సుదీర్ఘ విరామం అనంతరం ఈ రెండు జట్ల మ్యాచ్ జరగనుంది.
భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే దాన్ని మ్యాచ్‌గా మాత్రమే చూడరు అభిమానులు. అంతకుమించి అనే స్థాయిలో ఉంటుంది. రెండు దేశాల్లో కోట్లాది మంది అభిమానుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న టోర్నమెంట్ ఇది. ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన ప్లేయింగ్ 11, స్కోర్ కార్డ్, ప్లేయర్ల వివరాలు, రికార్డులు.. ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ మీ కోసం..
ఇవ్వాళ్టి మ్యాచ్ పాకిస్తాన్-హాంకాంగ్‌కు అత్యంత కీలకం. గెలిచిన జట్టు నెక్స్ట్ రౌండ్‌లో ప్రవేశిస్తుంది. ఓడిన టీమ్ ఎలిమినేట్ అవుతుంది.
గ్రూప్-ఏలో భారత్, గ్రూప్-బీలో ఆఫ్ఘనిస్తాన్ అగ్రస్థానంలో నిలిచాయి. ఈ రెండు జట్ల ఖాతాల్లో నాలుగు చొప్పున పాయింట్లు ఉన్నాయి. భారత్.. పాకిస్తాన్, హాంకాంగ్‌పై విజయం సాధించింది. ఆఫ్ఘన్.. శ్రీలంక, బంగ్లాదేశ్‌ను ఓడించింది.
యూఏఈలోని షార్జా స్టేడియంలో మ్యాచ్ షెడ్యూల్ అయింది. భారత కాలమానం ప్రకారం- సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. పసికూన హాంకాంగ్‌పై భారత్ ఇదివరకే తన ప్రతాపాన్ని చూపింది. ఇక పాకిస్తాన్ వంతు వచ్చింది.
ఆసియా కప్ 2022లో భాగంగా ఇవ్వాళ గ్రూప్-బీలో పాకిస్తాన్-హాంకాంగ్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. టీమిండియా చేతిలో ఓడిపోయాయి.
హార్దిక్ పాండ్యాను స్టార్‌గా కీర్తిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు షేర్ చేసిన ఆయన భార్య నటాషా
పాకిస్తాన్‌పై జరిగిన మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా పలువురు నాయకులు ఆయనను ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు.
ఆసియా కప్‌లో భాగంగా రేపు గ్రూప్-బీ మ్యాచ్ జరుగనుంది. బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి.
2018 ఆసియా కప్‌లో ఇదే పాకిస్తాన్‌పై జరిగిన మ్యాచ్‌లో గాయపడి స్ట్రెచర్‌పై గ్రౌండ్‌ను వీడిన హార్దిక్ పాండ్యా. ఇప్పుడు అదే ఆసియా కప్‌లో అదే పాకిస్తాన్‌పై మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను అందుకున్నాడు.
పాకిస్తాన్‌పై గెలిచి తన ఆసియా కప్ ప్రస్థానాన్ని ఆరంభించిన భారత్.. తన తదుపరి మ్యాచ్‌ను ఎల్లుండి ఆడబోతోంది. న్యూ కమ్మర్ హాంకాంగ్‌తో తలపడనుంది.
టీమిండియాను గెలిపించిన హార్దిక్ పాండ్యా-రవీంద్ర జడేజా. చివరి ఓవర్ నాలుగో బంతిని సిక్స్‌గా మలిచి భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు పాండ్యా. అతని స్వస్థలంలో సంబరాలు మిన్నంటాయి.
పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించడం పట్ల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రాత్రంతా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. జాతీయ పతాకాన్ని చేతపట్టుకుని రోడ్లపై సందడి చేశారు. బాణాసంచా కాల్చారు. స్వీట్లు పంచిపెట్టారు.
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించడం పట్ల కేప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఏకపక్ష విజయాల కంటే ఇలాంటి హోరాహోరిగా సాగిన మ్యాచ్‌ల గెలుపునే తాను ఆస్వాదిస్తానని వ్యాఖ్యానించాడు.
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 19.4 ఓవర్లలో 148 పరుగులు చేసి గెలుపొందింది.
5 వికెట్ల తేడాతో పాక్‌పై భారత్ గెలుపు
సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించిన హార్దిక్ పాండ్యా
ఉత్కంఠ మ్యాచ్‌లో పాక్‌పై భారత్ విజయం
ఉత్కంఠగా మారిన భారత్-పాక్ మ్యాచ్
డకౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కోహ్లీ.. నసీమ్ షా బౌలింగ్‌లో అతను ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేశారు.
నసీమ్ షా బౌలింగ్‌లో గోల్డెన్ డక్ అయిన కేఎల్ రాహుల్
ఆసియాకప్‌లో శుభారంభం చేసే దిశగా టీమిండియా దూసుకెళ్తుంది. పాకిస్థాన్ జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు దుమ్మురేపారు. దాంతో పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది.
అర్షదీప్ సింగ్ వేసిన 18వ ఓవర్‌లో మహమ్మద్ నవాజ్(1) కీపర్ క్యాచ్‌గా ఔట్ చేశాడు.
భువనేశ్వర్ కుమార్ వేసిన 17వ ఓవర్‌లో ఆసిఫ్ అలీ(7) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ కుష్టిల్ షా(2) ఔటయ్యాడు.
హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో పాకిస్థాన్ కీలక బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్(43) ఔటయ్యాడు.
ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ఫకార్ జమాన్(10) ఔట్
తొలి వికెట్ కోల్పోయిన పాకిస్థాన్. బాబర్ ఆజామ్(10) ఔట్
పాకిస్థాన్ తరఫున నసీమ్ షా అరంగేట్రం
.@iNaseemShah - Pakistan's T20I player No.96 🇵🇰
— Pakistan Cricket (@TheRealPCB) August 28, 2022
🧢 The young speedster is awarded his T20I debut cap 👏#AsiaCup2022 | #INDvPAK pic.twitter.com/eOC3AqMJ3V
ఈ మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 100 మ్యాచ్‌ల మైలురాయిని అధిగమించాడు. మూడు ఫార్మాట్‌లలోనూ (టెస్టు, వన్డే, టి20) కనీసం 100 మ్యాచ్‌ల చొప్పున ఆడిన రెండో క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు.న్యూజిలాండ్ ప్లేయర్ రాస్ టేలర్ తొలిసారి ఈ ఘనతను అందుకోగా విరాట్ అతని సరసన చేరాడు. భారత్, పాక్ మధ్య 9 టీ20 మ్యాచ్‌లు జరగ్గా.. ఆరింటిలో భారత్, రెండింటిలో పాక్ గెలిచాయి. మరో మ్యాచ్ ‘టై’ అయింది.
Captain @ImRo45 has won the toss and we will bowl first against Pakistan.
— BCCI (@BCCI) August 28, 2022
A look at our Playing XI for the game.
Live - https://t.co/o3hJ6VNfwF #INDvPAK #AsiaCup2022 pic.twitter.com/O0HQXFQzC4
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ పాకిస్తాన్: బాబర్ (కెప్టెన్), రిజ్వాన్, ఫఖర్, ఇఫ్తికర్, కుష్దిల్ షా, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, హారిస్ రవూఫ్, షానవాజ్ దహాని
ASIA CUP 2022. India XI: R Sharma (c), KL Rahul, V Kohli, S Yadav, H Pandya, R Jadeja, D Karthik (wk), B Kumar, A Khan, A Singh, Y Chahal. https://t.co/00ZHIa5C0t #INDvPAK #AsiaCup2022
— BCCI (@BCCI) August 28, 2022
రిషభ్ పంత్‌కు షాకిచ్చి దినేశ్ కార్తీక్ తీసుకున్న రోహిత్ శర్మ
IND vs PAK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
శ్రీలంక, అఫ్గాన్ మ్యాచ్ జరిగిన పిచ్‌పైనే భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది. పిచ్‌పై గడ్డి ఉంది కాబట్టి పేసర్లకు అనుకూలించే అవకాశం ఉందని వసీం అక్రమ్, సంజయ్ మంజ్రేకర్ తెలిపారు. ఈ క్రమంలోనే టాస్ కీలకం కానుంది.
దుబాయ్ మైదానం చేరుకున్న భారత క్రికెట్ జట్టు
#TeamIndia have arrived at Dubai International Cricket Stadium for #INDvPAK #AsiaCup2022 pic.twitter.com/HulEswjtpA
— BCCI (@BCCI) August 28, 2022
భారత్ X పాక్ మ్యాచ్ హడావుడి అంతా బయటనే. మాకు ఓ సాధారణ మ్యాచ్ మాత్రమేనని రోహిత్, కోహ్లీ, హార్దిక్, పంత్, జడేజా పేర్కొన్నారు.
Today two teams go one on one in a high octane clash of the #AsiaCup2022
— BCCI (@BCCI) August 28, 2022
Click below to watch #TeamIndia members speak about Battle Royale #INDvPAK
📽️📽️ https://t.co/7s1ncpc2ZB #AsiaCup2022 pic.twitter.com/aomE2U7wxN
ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. సుమారు మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరం అయ్యాడు. జింబాబ్వే పర్యటనతో మళ్లీ మ్యాచ్‌లు ఆడాడు. అదే 50 ఓవర్ల ఫార్మట్.
కేఎల్ రాహుల్‌కు కూడా ఈ మ్యాచ్ ప్రత్యేకమైనదే. ఈ ఏడాదిలో అతను ఆడబోయే మొట్టమొదటి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇదే.
బ్యాటంగ్ లైనప్ విషయంలో రోహిత్ శర్మ ఆచితూచి నిర్ణయం తీసుకుంటోన్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్లు దినేష్ కార్తీక్, రిషభ్ పంత్‌లల్లో ఒకరిని మాత్రమే ప్లేయింగ్ 11లో చోటు దక్కొచ్చు. ఇద్దరినీ జట్టులో తీసుకుంటే- దీపక్ హుడాకు స్థానం దక్కదు.
ద్రావిడ్ కోవిడ్ బారిన పడిన సమయంలో టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ పని చేశారు. ద్రావిడ్ జట్టుతో చేరికతో ఆయన స్వదేశానికి తిరుగుముఖం పట్టనున్నారు.
పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. కోవిడ్ బారిన పడి హోటల్‌కే పరిమితమైన హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. జట్టును కలిశాడు. ఆయనకు నిర్వహించిన లేటెస్ట్ టెస్ట్‌లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది.
పాకిస్తాన్‌తో ఆడబోయే తుదిజట్టును ఎంపిక చేయడంలో రోహిత్ శర్మ మల్లగుల్లాలు పడుతున్నారు. ఇంకా ప్లేయింగ్ 11ను సెలెక్ట్ చేయలేదు. శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ రిజల్ట్ చూసిన తరువాతే ప్లేయింగ్ 11ను ఎంపిక చేస్తామని రోహిత్ శర్మ చెప్పాడు.
విరాట్ కోహ్లీ సెంచరీ చేయక 1000 రోజులు దాటిపోయింది. 2019లో అతను చివరిసారిగా బంగ్లాదేశ్‌పై వంద పరుగులు చేశాడు. ఆ తరువాత ఇప్పటివరకూ ఏ ఫార్మట్‌లో కూడా ఈ మార్క్‌ను అందుకోలేకపోయాడు. ఆసియా కప్ టోర్నీలో కోహ్లీ పరుగుల కరవును తీర్చుకుంటాడా? లేదా? అనేది ఆసక్తికరం.
టీమిండియా బ్యాటింగ్ వెన్నెముక విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ ఎంతో ప్రత్యేకమైనది. ఇది అతని 100వ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్. అది కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మీదే కావడంతో కోహ్లీపై అందరి దృష్టీ నిలిచింది.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషించనుంది. టాస్ గెలిచిన జట్టు కేప్టెన్ ఛేజింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం దుబాయ్ స్టేడియం ఆనవాయితీ.
శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో కూడా ఇదే రుజువైంది. శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ అలవోకగా ఛేదించడాన్ని బట్టి చూస్తే- పిచ్ తత్వం ఏమిటనేది అర్థమౌతోంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టుకు ఎక్కువ విజయాలను అందించింది. ఇప్పటివరకు దుబాయ్ స్టేడియంలో 74 మ్యాచ్‌లు జరగ్గా ఇందులో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య 39.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక. దుబాయ్ వాతావరణం మ్యాచ్ కొనసాగడానికి అనుకూలంగా ఉంది. వర్షం పడే సూచనలు ఏ మాత్రం లేవు.
ఆసియా కప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా ఈ సాయంత్రం భారత్-పాకిస్తాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది.
టీ20 ఫార్మట్‌లో పాకిస్తాన్‌పై భారత్‌దే పైచేయి. ఇప్పటివరకు మొత్తం తొమ్మిదిసార్లు ఈ రెండు జట్లు టీ20 మ్యాచ్‌లల్లో తలపడ్డాయి. ఇందులో ఏడుసార్లు భారత్ గెలిచింది. రెండుసార్లు మాత్రమే విజయం పాకిస్తాన్‌ను వరించింది.
టీమిండియా, పాకిస్తాన్ కేప్టెన్లు రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్ ముచ్చట్లు. దుబాయ్ స్టేడియంలో ప్రాక్టీస్ సందర్భంగా కెమెరాలకు చిక్కిన అరుదైన దృశ్యం
Indian Captain Rohit Sharma meets Pakistan captain Babar Azam. What a lovely pictures. pic.twitter.com/uV6qinTfvr
— CricketMAN2 (@ImTanujSingh) August 27, 2022
పాకిస్తాన్‌తో టీ20 ఫార్మట్‌లో అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్ విరాట్ కోహ్లీ. అయిదుసార్లు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తంగా ఏడు ఇన్నింగ్స్ ఆడాడు కోహ్లీ.
ఈ సారి కొత్తగా ఆసియా కప్ టోర్నమెంట్‌కు హాంకాంగ్ క్వాలిఫై అయింది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్‌తో పాటు హాంకాంగ్ చోటు దక్కించుకుంది.
గ్రూప్-బీలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి.
ఈ సాయంత్రం 7:30 గంటలకు దుబాయ్ వేదికగా ఆసియా కప్ టోర్నమెంట్ గ్రాండ్‌గా ఆరంభం కానుంది.
ఆదివారం రోజున భారత్ పాకిస్తాన్‌ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్
తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో అఫ్ఘానిస్తాన్ ఢీ
మరి కొన్ని గంటల్లో ఆసియా కప్ 2022 ప్రారంభం