ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్‌కు ముందు భారత ప్లేయర్ల రియాక్షన్స్ ఇవే.. ! బయట ఎంత హైప్ ఉన్నా?

నేడు సాయంత్రం 7.30కు ఆసియా కప్ టోర్నీలో ఇండియా వర్సెస్ భారత్ మ్యాచ్ ప్రారంభం కానుంది. యావత్ భారత క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ మ్యాచ్ ఆడబోతున్న భారత ప్లేయర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తదితర భారత ప్లేయర్లు ఈ మ్యాచ్ గురించి తమ ఆలోచనలను పంచుకున్నారు. ఇండియా, పాక్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో రెండు జట్ల మధ్య గత దశాబ్ద కాలంగా ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్‌లు జరగట్లేవు. ఫలితంగా ఐసీసీ, ఏసీసీ ఈవెంట్లలో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. ఈ ఏడాది ఆసియా కప్ టోర్నీలో ఇండియా వర్సెస్ పాక్ మధ్య మూడు మ్యాచ్‌లు జరిగే వీలుంది. తొలుత గ్రూప్ మ్యాచ్ నేడు జరగనుంది. ఈ మ్యాచ్ గురించి మన ప్లేయర్లు ఏమన్నారో ఓసారి చూద్దాం

ప్రిపరేషన్ పరంగా తగ్గేదే లేదు : రోహిత్ శర్మ
మేము ఈ మ్యాచ్ గెలవడానికి మా ప్రయత్నం పూర్తిస్థాయిలో చేస్తాం. ప్రస్తుతం మేం సాధారణ మ్యాచ్‌లాగే భావిస్తున్నాం. నేను అనుకుంటుందేంటంటే ప్రిపరేషన్ పరంగా చూసుకుంటే మేం ఏమాత్రం తక్కువ లేము. ప్రత్యర్థి జట్టు గొప్పల వైపు మేం అస్సలు చూడబోం. ప్రత్యర్థి జట్టు ఏం చేయగలదనే దాని కంటే.. ఓ జట్టు మేం సాధించాల్సిందేంటనేది మాకు ముఖ్యం. ఏదేమైనా ఈ మ్యాచ్ మాకు చాలెంజింగ్‌గా ఉండబోతోంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మేము అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం.

ఇరు జట్ల మధ్య ఎప్పుడూ ఉండేదే : కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. 'పాకిస్థాన్‌తో ఈ టోర్నీలో భాగంగా రెండు మూడు మ్యాచ్‌లు ఆడేందుకు అవకాశం దొరుకుతుంది. ఈ టోర్నీలో మమ్మల్ని మేం సవాలు చేసుకోవడానికి గొప్ప అవకాశం లభించింది. గత రెండేళ్లుగా పాక్ జట్టు మంచి క్రికెట్ ఆడుతుంది. ఈ మ్యాచ్ ఎప్పుడూ హై ప్రెషర్ గేమ్. ఇరు జట్ల మధ్య ఇది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.' అని చెప్పాడు. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. 'గ్రౌండ్లోకి అడుగుపెట్టినప్పుడు, ఇది మాకు మరొక మ్యాచ్ మాత్రమే. మేం మా సన్నద్ధతపైనే ఎక్కువ ఫోకస్ పెడతాం' అని అన్నాడు.

నా చిన్నప్పటి నుంచి వింటున్నా : సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నేను నా చిన్నప్పటి నుంచి భారత్ vs పాకిస్తాన్ గేమ్ గురించి చాలా డిస్కసన్స్ జరుగుతూంటే వింటూనే ఉన్నాను. ఇదో గొప్ప పోటీ అని ప్రజలు అంటుంటారు. అయితే మేం గ్రౌండ్లోకి వెళ్లినప్పుడు ఇది అన్ని మ్యాచ్‌లలాగే మాకు మరో మ్యాచ్ అనిపిస్తుంది. మా చర్యలన్నీ ఇతర మ్యాచ్‌లలాగే ఉంటాయి. అదే మేం గ్రౌండ్లో చూపిస్తాం. నేను అయితే నా జోన్‌లో ఉండి గేమ్ ఆడతాను.' అని చెప్పాడు. రవీంద్ర జడేజా మాట్లాడుతూ.. 'ఈ గేమ్‌పై ఎక్కువ దృష్టి ఉంది. ఈ మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేసి జట్టు పై చేయి సాధించేలా చేస్తాం.' అని జడ్డూ చెప్పాడు.

బయట సంగతి బయటే ఉంచాలి : హార్దిక్ పాండ్యా
రిషబ్ పంత్ మాట్లాడుతూ.. 'ఇది ఎప్పుడూ పెద్ద మ్యాచే. భారీ హైప్ ఉంది. కానీ ఒక ఆటగాడిగా.. నేను 100శాతం ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఈ మ్యాచ్ పరంగా మాపై ఒత్తిడి, అంచనాలు భారీగా ఉన్నాయి.' అన్నాడు. హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ గురించి వస్తున్న హైప్ అంతా బయటే ఉంది. మేం దాని గురించి అర్థం చేసుకున్నాం. చాలా మంది వ్యక్తులు ఈ గేమ్‌తో సైకాలజికల్‌గా అటాచ్ అయ్యారు. కానీ మేం మ్యాచ్ కోసం బయట ఉన్న హైప్‌ను బయటే ఉంచేలా చూసుకోవాలి. మాకు మ్యాచ్ పరంగా అవసరమైన వాటిపైనే మేం దృష్టి పెట్టాలి.' అని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications