ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన హార్దిక్ పాండ్యా..! తాజాగా మెరుగుపడ్డ ఆసియాకప్ స్టార్ల ర్యాంకులివే..!

ఆసియా కప్‌లో మొదటి మూడు మ్యాచ్‌లలో సత్తా చాటిన హార్దిక్ పాండ్యా సహా తదితర ఇతర దేశాల ఆటగాళ్లు.. తాజా ఎంఆర్ఎఫ్ టైర్స్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మెరుగయ్యారు. పాకిస్తాన్‌పై హార్దిక్ పాండ్యా అసాధారణ వ్యక్తిగత ప్రదర్శన కనబర్చడంతో అతను టీ20 ఆల్-రౌండర్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిది స్థానాలు ఎగబాకి అయిదో స్థానానికి చేరుకున్నాడు.
భారత్ తరఫున ప్లేయర్ల అత్యుత్తమ టీ20 ర్యాంక్ ఇదే. బౌలింగ్లో 3/25 ప్రదర్శనతో పాటు.. బ్యాటింగ్లో కేవలం 17బంతుల్లో 33పరుగులతో నాటౌట్‌గా నిలిచిన హార్దిక్ పాండ్యా భారత్‌కు పాకిస్థాన్ మీద అపురూపమైన విజయాన్ని అందించాడు. ఆసియా కప్ మాత్రమే కాకుండా త్వరలో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు కీలక ప్లేయర్‌గా హార్దిక్ పాండ్యా కానున్న సంగతి తెలిసిందే.

టాప్ 3కి చేరుకున్న రషీద్ ఖాన్
ఆసియా కప్ టోర్నమెంట్‌లో స్ట్రాంగ్ కంటెండర్‌గా ఆఫ్ఘనిస్తాన్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చుతున్న సంగతి తెలిసిందే. ఆ జట్టుకు చెందిన స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ రెండు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. తోటి లెగ్ స్పిన్నర్లు అయిన ఆదిల్ రషీద్, ఆడమ్ జంపాలను అతను దాటేసి మూడో స్థానానికి చేరుకున్నాడు. రషీద్ కంటే ముందు దక్షిణాఫ్రికాకు చెందిన ఎడమ చేతి మణికట్టు స్పిన్నర్ తబ్రైజ్ షమ్సీ రెండో స్థానంలో ఉండగా.. ఇక నంబర్ 1 పొజిషన్లో జోష్ హేజిల్‌వుడ్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

పడిపోయిన సూర్యకుమార్ యాదవ్ ర్యాంకు
ఇకపోతే ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన మరో ఆల్రౌండర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఏడు స్థానాలు ఎగబాకి టాప్ టెన్‌లోకి ప్రవేశించాడు. అతను ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నాడు. ఇకపోతే భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్తాన్‌పై 4/26 ప్రదర్శనతో ఆకట్టుకున్న భువీ.. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇకపోతే టీ20 బ్యాటింగ్ టాప్ టెన్‌లో కొత్తగా ఎవరికీ చోటు దక్కలేదు. అయితే పాకిస్తాన్‌కు చెందిన మొహమ్మద్ రిజ్వాన్ రెండో స్థానానికి ఎగబాకాడు. అతను బాబర్ ఆజామ్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మన భారత స్టార్ సూర్యకుమార్ యాదవ్ ఓ స్థానం పడిపోయి 3వ స్థానానికి చేరుకున్నాడు. ఇకపోతే ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన హజ్రతుల్లా జజాయ్ 14వ ర్యాంకుకు, రహ్మానుల్లా గుర్బాజ్ ఐదు స్థానాలు ఎగబాకి 29వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

మూడు లిస్టులలో మెరుగుపడ్డ స్టోక్స్ ర్యాంకు
ఇకపోతే మిగతా రెండు ఫార్మాట్లు అయిన వన్డేలు, టెస్టుల్లోనూ కొన్ని మార్పులు జరిగాయి. దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్ మూడు టెస్ట్ ర్యాంకింగ్ లిస్టులలో పైకి ఎగబాకాడు. అతను ఈ టెస్టులో సెంచరీ చేయడంతో పాటు 2/17, 2/30తో బౌలింగ్లోనూ రాణించాడు. ఇకపోతే స్టోక్స్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తొమ్మిది స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు ఎగబాకి 38వ స్థానానికి, ఆల్ రౌండర్ జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇకపోతే భారత స్టార్ రవీంద్ర జడేజా టెస్ట్ ఆల్రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications