For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Asia Cup 2022 Final : ఫైనల్లో పాకిస్థాన్ కొంపముంచిన 5 మిస్టేక్స్..! అవే శ్రీలంకకు ప్లస్ పాయింట్లుగా

 Asia Cup 2022 Final : Top 5 Reasons for Pakistan To Lost to Srilanka in Final

అంచనాలు లేకుండా ఆసియా కప్ 2022 టోర్నీలో బరిలోకి దిగిన శ్రీలంక సంచలనం చేసింది. ఏకంగా కప్ ఎగురువేసుకుపోయింది. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో హసరంగా(36, 3/27) ఆల్‌రౌండ్ ప్రదర్శనకు తోడు భానుక రాజపక్స(71 నాటౌట్) వీరోచిత పోరాటంతో 23పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్లకు 170 పరుగులు చేసింది. అనంతరం పాకిస్థాన్ 147పరుగులకు ఆలౌటైంది. ఇక మ్యాచ్ ప్రారంభంలో పాకిస్థాన్ ఈజీగా గెలిచేట్టు కన్పించింది. ఎందుకంటే శ్రీలంక టాపార్డర్ పాక్ బౌలింగ్ ధాటికి కుప్పకూలింది. 58పరుగులకే 5వికెట్లు కోల్పోయిన శ్రీలంకకు ఇక ఓటమి లాంఛనమే అనిపించింది. అయితే పాకిస్థాన్ చేసిన కొన్ని మిస్టేక్స్, ఆ జట్టు ప్లేయర్ల వైఫల్యాల పాక్ ఓటమి పాలయింది. ఇక పాక్‌ను కొంపముంచిన అయిదు కారణాలను పరిశీలిస్తే..

1. ఆ క్యాచ్ పట్టుంటేనా..?

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక టాపార్డర్‌ను పాక్ బౌలర్లు నషీమ్ షా, హరీస్ రౌఫ్, ఇఫ్తికర్, షాదాబ్ దెబ్బతీశారు. వీరి ధాటికి పాక్ 58పరుగులకే 5వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత పాక్ బౌలర్లు తమ ఇంటెన్సిటీ కొనసాగించలేకపోయారు. ఈ క్రమంలో రాజపక్స, హసరంగా 58పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. హసరంగాను ఔట్ చేయడంలో పాక్ బౌలర్లు విఫలమయ్యారు. తర్వాత కరుణరత్నే, రాజపక్స 54పరుగుల భాగస్వామ్యాన్ని కూడా పాక్ బౌలర్లు కట్టడి చేయలేదు. 18వ ఓవర్ 3వ బంతికి రాజపక్స 42పరుగుల వద్ద ఉన్నప్పుడు రౌఫ్ బౌలింగ్లో ఇచ్చిన క్యాచ్‌ను షాదాబ్ మిస్ చేశాడు. అది బిగ్ మైనస్ అయింది. అప్పుడు శ్రీలంక స్కోరు 142. తర్వాత రాజపక్స ధాటిగా ఆడాడు. ఆ తర్వాత మరోసారి 19వ ఓవర్ చివరి బంతికి ఇచ్చిన క్యాచ్ కూడా ఆసిఫ్ అలీ, షాదాబ్ కలిసి మిస్ చేశారు. ఫలితంగా స్కోరు 170కి చేరింది. లేకుంటే స్కోరు 150, 160 మధ్యే ఉండేది.

2. నవాజ్‌ను ఎందుకు వాడుకోలేదు

2. నవాజ్‌ను ఎందుకు వాడుకోలేదు

కెప్టెన్ బాబర్ ఆజామ్ కెప్టెన్సీ ఫైనల్లో ఏమాత్రం బాలేదు. అతను 58పరుగులకు 5వికెట్లు పడ్డాక వికెట్ టేకర్ అయిన నవాజ్‌ను పెద్దగా ఉపయోగించుకోలేదు. నవాజ్ ఒక్క ఓవర్లో కేవలం 3పరుగులే ఇచ్చాడు. అతనికి కనీసం 3ఓవర్లు కూడా ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే బాగుండేది. ఇండియాపై గ్రూప్ స్టేజులో 3, సూపర్ 4 స్టేజులో 2 వికెట్లు తీసి నవాజ్ మ్యాచ్‌లో ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. కీలక ఫైనల్లో మాత్రం అతన్ని బాబర్ సరిగా వాడుకోలేదు. ఇక ఇఫ్తికర్ అహ్మద్‌కు పెద్ద పీట వేశాడు. ఇఫ్తికర్ ఒక వికెట్ తీసినప్పటికీ.. తర్వాత రన్స్ ఇచ్చేశాడు.

3. రిజ్వాన్, ఇఫ్తికర్ వన్డే ఇన్నింగ్స్.. శ్రీలంక మెరుపు ఫీల్డింగ్

171పరుగుల ఛేదనలో 22పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పాక్ ఇన్నింగ్స్ నిలబెట్టాల్సిన బాధ్యతను రిజ్వాన్, ఇఫ్తికర్ మోశారు. వీరు వికెట్ కుదురుకున్నాక కూడా తమ వన్డే ఇన్నింగ్స్ ఆపలేదు. దీంతో రిక్వయిడ్ రన్ రేట్ పెరిగిపోతూ ఉంది. రిజ్వాన్ (49 బంతుల్లో 55పరుగులు 4ఫోర్లు, 1సిక్సర్), ఇఫ్తికర్ (32పరుగులు 31బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్) జిడ్డు స్ట్రైక్ రేట్‌తో ఆడారు. ఇక వీరు ఓటయ్యేసరికి 16.1ఓవర్లకు జట్టు 5వికెట్లు కోల్పోయి 110పరుగులు చేసింది. దీంతో 23బంతుల్లో 61పరుగులు చేయాల్సిన టఫ్ పరిస్థితి ఏర్పడింది. ఇక ఇఫ్తికర్, నవాజ్, రిజ్వాన్‌లు భారీ షాట్లు ఆడగా.. బౌండరీల వద్ద శ్రీలంక ఫీల్డర్లు మెరుపు ఫీల్డింగ్‌తో క్యాచ్‌లు అందుకున్నారు. ఒక్క క్యాచ్ మిస్ చేసినా ఫలితం తారుమారయ్యేదేమో.

4. లోయర్ ఆర్డర్ వైఫల్యం, టర్నింగ్ పాయింట్‌గా హసరంగా ఓవర్

ఎప్పటిలాగే పాకిస్థాన్‌ను వేధించే సమస్య మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ వైఫల్యం.. ఆ జట్టు లోయర్ ఆర్డర్లో ఆడే ఖుష్దీల్ షా, ఆసిఫ్ అలీ ఎప్పుడో గానీ ఆడారు. ఆడిన రోజు మాత్రం విధ్వంసకరంగా ఆడతారు. కీలక మ్యా‌చ్‌లో మాత్రం చేతులెత్తేశారు. ఖుష్దీల్ (2), ఆసిఫ్ (0), రిజ్వాన్ ముగ్గురు 17వ ఓవర్లో హసరంగా బౌలింగ్లో ఔటయ్యారు. దీంతో మ్యాచ్ పూర్తిగా శ్రీలంక వశమైంది. స్పిన్ ఆల్రౌండర్లు షాదాబ్ ఖాన్ (13), మహమ్మద్ నవాజ్ (6) కూడా విఫలమయ్యారు. దీంతో చివర్లో పాక్ హిట్టింగ్ చేయలేక చేతులెత్తేసింది.

5. బాబర్ పేలవ ఫామ్, ఫాఖర్ జమాన్ డకౌట్

5. బాబర్ పేలవ ఫామ్, ఫాఖర్ జమాన్ డకౌట్

ఆసియాకప్ టోర్నీలో పేలవ ఫామ్ కనబర్చిన బాబర్ ఆజామ్.. ఫైనల్లోనూ తేలిపోయాడు. అతన్ని బుట్టలో ఎలా వేయాలో తెలిసిన శ్రీలంక.. ప్రమోద్ మధుశన్‌ను రెండో ఓవర్లో బరిలోకి దించింది. ఫైన్ లెగ్‌లో ఫీల్డర్ ఉంచి.. బాబర్ ఆజామ్‌కు లెగ్ సైడ్ హిట్ చేసేలా బాల్ వేయగా అతను హిట్ చేశాడు. దీంతో బంతి నేరుగా ఫైన్ లీగ్ ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది. ఆ క్యాచ్ మాత్రం ఫీల్డర్ ఒంటిచేత్తో అద్భుతంగా అందుకున్నాడు. తర్వాత ఫాఖర్ జమాన్ తర్వాత బంతికే బౌల్డ్ అయ్యాడు. దీంతో 22పరుగులకే కీలక రెండు వికెట్లు కోల్పోవడంతో పాక్ తడబడింది. ఈ మ్యాచ్ ఆసాంతం పరిశీలిస్తే.. శ్రీలంక ఫీల్డర్లు ఒక్క క్యాచ్‌ మిస్ చేయలేదు. పాకిస్థాన్ రెండుక్యాచ్‌లు మిస్ చేసింది.

తుది జట్లు

తుది జట్లు

శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), దనుష్క గుణతిలక, ధనంజయ డిసిల్వా, భానుక రాజపక్స, దసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, ప్రమోద్ మదుషన్, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక

పాకిస్థాన్ : మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజామ్ (కెప్టెన్), ఫాఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దీల్ షా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ హస్నైన్

Story first published: Monday, September 12, 2022, 10:10 [IST]
Other articles published on Sep 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+