Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia cup 2022 : ఆఫ్ఘాన్‌ను బంగ్లా అడ్డుకుంటుందా.. షకీబ్ సారథ్యం కలిసొస్తుందా? తుది జట్లలో ఎవరంటే?

Asia cup 2022 : Afghanistan vs Banglaedh Playing 11 prediction and Match Details

నేడు షార్జా క్రికెట్ గ్రౌండ్‌లో ఆసియా కప్ - 2022 తమ ప్రారంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు భీకర ఫాంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. రాత్రి 7.30కు మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్‌గా షకీబ్ అల్ హసన్‌ మరోసారి వ్యవహరించనుండడంతో బంగ్లా ఆఫ్ఘన్‌ను ఎదుర్కొంటుందో లేదో చూడాలి. కెప్టెన్సీ అనుభవం షకీబ్‌కు చాలా ఉంది. అందువల్ల అతనెలాంటి వ్యూహాలు పన్ని ఆఫ్ఘన్‌ను ఎదుర్కొంటాడో చూడాలి. ఆసియా కప్ టోర్నీ మొదటిసారి టీ20 ఫార్మాట్‌లో 2016లో జరిగింది. అప్పుడు టోర్నీ రన్నరప్‌గా బంగ్లాదేశ్ నిలిచింది. అలాగే పోయిన సారి కూడా పాకిస్థాన్, శ్రీలంక కాకుండా ఆసియా కప్ రన్నరప్‌గా నిలిచింది.

జింబాబ్వే చేతిలో సిరీస్ పరాజయంతో..

జింబాబ్వే చేతిలో సిరీస్ పరాజయంతో..

అయితే ఇటీవల బంగ్లాదేశ్ జట్టు చాలా పేలవ ఫామ్‌లో ఉంది. గతేడాది టీ20 ప్రపంచ‌కప్ నుండి బంగ్లాదేశ్ ఆడిన 13మ్యాచ్‌లలో కేవలం 2మ్యాచ్‌లను మాత్రమే గెలిచింది. ఇటీవల జింబాబ్వే లాంటి జట్టుతో టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో ఓడిపోయింది. దీంతో ఆ జట్టు ఎలా పుంజుకుంటుందనేది ఆసక్తికరంగా ఉంది. మరో వైపు ఆసియా కప్ 2022లో తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంకను 8వికెట్ల తేడాతో ఓడించిన తర్వాత చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆఫ్ఘాన్ బంగ్లాదేశ్‌కు తమ బౌలింగ్ రుచి చూపించాలని చూస్తోంది. ఇక బంగ్లాపై ఆఫ్ఘనే గెలిచేలా కన్పిస్తుంది.

గెలిచినా గెలవకున్నా ఆఫ్ఘన్‌కు పోయేదేం లేదు

గెలిచినా గెలవకున్నా ఆఫ్ఘన్‌కు పోయేదేం లేదు

ఈ మ్యాచ్ గెలిచినా గెలవకున్నా ఆఫ్ఘన్ టఫ్ పోటీ ఇస్తే చాలు.. ఎందుకంటే తన మొదటి మ్యాచ్‌లో 8వికెట్ల తేడాతో గెలిచిన ఆఫ్ఘన్ నెట్ రన్ రేట్ భారీగా ఉంది. అందువల్ల ఆఫ్ఘన్ సూపర్ 4కు చేరుకోవడం దాదాపు ఖాయమే. ఇక బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ గెలవడంతో పాటు శ్రీలంకపై గెలిస్తేనే సూపర్ 4కు వెళ్తుంది. ఒకవేళ శ్రీలంక బంగ్లాపై గెలిచినా బంగ్లాదేశ్‌కు సూపర్ 4 దశకు చేరుకునే అవకాశాలుంటాయి. అయితే ఆ జట్టు మార్జిన్ (నెట్ రన్ రేట్) ఎక్కువగా ఉండేలా ఆఫ్ఘన్ మీద గెలవాలి.

తుది జట్ల అంచనా

తుది జట్ల అంచనా

బంగ్లాదేశ్ : మహ్మద్ నయీమ్, అనాముల్ హక్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), అఫీఫ్ హొస్సేన్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, ముస్తాఫిజుర్ రహ్మాన్, హస్సాన్‌డెక్, ఎబాడోట్ హొస్సేన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, మెహదీ హసన్,

ఆఫ్ఘనిస్తాన్: హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ (కెప్టెన్), రషీద్ ఖాన్, నవీన్-ఉల్-హక్, ముజీబుల్ ఉర్హుల్ రహ్మత్, ఫరుఖుల్లా, ఫరీద్ అహ్మద్, నూర్ అహ్మద్

Story first published: Tuesday, August 30, 2022, 10:40 [IST]
Other articles published on Aug 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+