Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అలవోకగా గెలిచి- టీమిండియాకు దారి చూపిన ఆఫ్ఘనిస్తాన్: ఆ అయిదు కారణాలివే..!!

Asia Cup 2022: 5 Reasons why Afghanistan easily won the match against Sri Lanka

దుబాయ్: ఆసియా కప్ మెగా టోర్నమెంట్ ఆరంభమైంది. ఆఫ్ఘనిస్తాన్ అనూహ్యంగా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై తిరుగులేని విజయాన్ని అందుకుంది. రెండు పాయింట్లతో గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచింది. ఇవ్వాళ రెండో మ్యాచ్. గ్రూప్-ఏలో భాగంగా ఇవ్వాళ్టి రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఢీ కొనబోతోన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ జరుగనుంది.

చెలరేగిన బౌలర్లు..

చెలరేగిన బౌలర్లు..

దుబాయ్ స్టేడియంలో టాస్ గెలిచి- తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్‌లో చెలరేగింది. శ్రీలంకను 105 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం ఆ లక్ష్యాన్ని 10.1 ఓవర్లల్లో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఆసియా కప్ టోర్నమెంట్‌లో తన ప్రస్థానాన్ని ఘనంగా ఆరంభించింది ఆఫ్ఘన్. శ్రీలంక ఇన్నింగ్‌లో భానుక రాజపక్స-38, లోయర్ ఆర్డర్ బ్యాటర్ చమిక కరుణరత్నె-31 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. ఏడుమంది బ్యాటర్లు అయిదు చొప్పున పరుగులు కూడా చేయలేకపోయారు.

టాస్ గెలవడంతోనే..

టాస్ గెలవడంతోనే..

టాస్ గెలవడంతోనే సగం మ్యాచ్‌ ఆఫ్ఘనిస్తాన్ వైపు మొగ్గు చూపించినట్టయింది. దుబాయ్ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. పిచ్ పరిస్థితులను పూర్తిగా వినియోగించుకుంది. తొలుత బౌలింగ్, ఆ తరువాత బ్యాటింగ్‌లో చెలరేగింది. శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ అలవోకగా ఛేదించింది. రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టుకు ఎక్కువ విజయాలను అందించింది దుబాయ్ పిచ్. ఇప్పటివరకు దుబాయ్ స్టేడియంలో 74 మ్యాచ్‌లు జరగ్గా ఇందులో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య 39. శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో కూడా ఇదే రుజువైంది.

బెస్ట్ బౌలింగ్..

బెస్ట్ బౌలింగ్..

ఆఫ్ఘనిస్తాన్‌ ప్రధానంగా బౌలింగ్ వనరుల మీద ఎక్కువగా ఆధారపడుతుంటుందనేది ఈ మ్యాచ్ మరోసారి రుజువు చేసింది. టీ20 స్పెషలిస్ట్ బౌలర్లు ఉన్నారీ టీమ్‌లో. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారూఖీ, నవీనుల్ హక్, ముజీబుర్ రెహ్మాన్, మహ్మద్ నబీ వంటి మెరికల్లాంటి బౌలర్లు ఉన్నారు. ఈ మ్యాచ్ రషీద్ ఖాన్ వికెట్లు పడగొట్టలేనప్పటికీ.. పరుగులను నియంత్రించగలిగాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫారూఖీ-3, ముజీబుర్, మహ్మద్ నబీ రెండు చొప్పున, నవీనుల్ హక్ ఓ వికెట్ పడగొట్టారు.

కోలుకోనివ్వని బౌలర్లు..

కోలుకోనివ్వని బౌలర్లు..

ఇన్నింగ్ ఆరంభం నుంచి కూడా విరుస పెట్టి వికెట్లు తీశారు బౌలర్లు. అయిదు పరుగులకే మూడు వికెట్లను లంక జట్టు కోల్పోయిందంటే ఆఫ్ఘన్ బౌలింగ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మళ్లీ 49 పరుగుల వద్ద వికెట్ల పతనం మొదలైంది. స్కోర్ బోర్డ్ 75 పరుగులకు చేరుకునే సమయానికి తొమ్మిది వికెట్లు నేలకూలాయి. చివర్లో చమిక కరుణరత్నె 31 పరుగులతో ప్రతిఘటించలేకపోయి ఉంటే ఆ మాత్రం స్కోర్ కూడా లంకేయుల ఖాతాలో చేరేది కాదు.

బ్యాటింగ్‌లో

బ్యాటింగ్‌లో

పరుగులు చేయడానికి లంకేయులు నానాతంటాలు పడిన అదే పిచ్‌పై ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు దుమ్ము దులిపారు. 83 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆఫ్ఘన్. ఓవర్‌కు 14 పరుగులు చొప్పున పిండుకున్నారు. 6.1 ఓవర్లలోనే 83 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్లు లంక బౌలర్ల దుమ్ము దులిపారు. హజ్రతుల్లా జలాల్ 28 బంతుల్లో అయిదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ రహ్మదుల్లా గుర్బాజ్.. పక్కా టీ20 షాట్లను కొట్టాడు. 18 బంతుల్లో నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో 40 పరుగులు చేశాడు.

Story first published: Sunday, August 28, 2022, 7:55 [IST]
Other articles published on Aug 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+