న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎవరు గెలుస్తారో?: ఆసియా కప్: భారత్ Vs పాకిస్థాన్ జట్ల బలాబలాలివే!

Asia Cup 2018 : Ind-Pak Match Analysis
Asia Cup 2018: All you need to know about India-Pakistan clash

హైదరాబాద్: ఆసియా కప్‌లో హై ఓల్టేజ్ మ్యాచ్‌కి సర్వం సిద్ధమైంది. దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో మరికొన్ని గంటల్లో భారత్-పాక్ జట్ల మధ్య సాయంత్రం 5 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అద్భుతమైన బ్యాటింగ్ లైనప్‌తో టీమిండియా, పదునైన పేస్ బౌలింగ్ ఎటాక్‌తో పాకిస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌కి సై అంటే సై అంటున్నాయి.

<strong>భారత్ Vs పాక్ మ్యాచ్: కీ బ్యాటిల్స్, ఎక్కడ చూడాలి, ఎన్ని గంటలకు!</strong>భారత్ Vs పాక్ మ్యాచ్: కీ బ్యాటిల్స్, ఎక్కడ చూడాలి, ఎన్ని గంటలకు!

టోర్నీలో భాగంగా గ్రూప్-ఏలో ఉన్న భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటికే చెరో మ్యాచ్ నెగ్గాయి. తొలి గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్, పాక్ జట్లు హాంకాంగ్‌పై విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి గ్రూప్-ఏలో టాపర్‌గా నిలవాలని ఇరు జట్లు ఊవిళ్లూరుతున్నాయి.

మార్పులతో బరిలోకి దిగే అవకాశం

మార్పులతో బరిలోకి దిగే అవకాశం

అయితే, పాక్‌తో జరిగే మ్యాచ్‌లో భారత జట్టు కొన్ని మార్పులతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. హాంకాంగ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ప్రయోగాలు చేసిన సంగతి తెలిసిందే. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌కి విశ్రాంతినిచ్చి పేసర్ ఖలీల్ అహ్మద్‌కు జట్టు మేనేజ్‌మెంట్ చోటు కల్పించిన సంగతి తెలిసిందే.

అనూహ్యంగా చోటు దక్కించుకున్న అంబటి రాయుడు, ఖలీల్ అహ్మద్

అనూహ్యంగా చోటు దక్కించుకున్న అంబటి రాయుడు, ఖలీల్ అహ్మద్

అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకున్నారు. దీంతో ఈ ఇద్దరూ పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ఎంపికవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఓపెనర్లు రోహిత్‌, ధావన్‌ ఎలాంటి ఆరంభాన్నిస్తారన్నది కీలకం. మిడిలార్డర్‌ను మరింత పటిష్టం చేసేందుకు ధోనితో పాటు హార్దిక్ పాండ్యాను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తీవ్రంగా నిరాశ పరిచిన భారత బౌలర్లు

తీవ్రంగా నిరాశ పరిచిన భారత బౌలర్లు

హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌‌లో బౌలర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. తొలి మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న శార్ధూల్ ఠాకూర్‌ను తప్పించి, బుమ్రాకు తుది జట్టులో చోటు కల్పించనున్నారు. ఇదే జరిగితే భువనేశ్వర్ కుమార్‌, బుమ్రా, ఖలీల్ అహ్మద్‌.. భారత పేస్ బౌలింగ్ బాధ్యతలు పంచుకుంటారు. స్పిన్నర్లు కుల్దీప్‌, చాహల్‌ స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌ను ఎలా సద్వినియోగం చేసుకుంటారన్నది ఆసక్తికరం.

భారత జట్టు బలం: బ్యాటింగ్, స్పిన్ ద్వయం

బలహీనత: పేస్ బౌలింగ్

కీలక ఆటగాళ్లు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, బుమ్రా, చాహాల్, కుల్దీప్, ఖలీల్ అహ్మద్

భారత్‌తో మ్యాచ్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాక్

భారత్‌తో మ్యాచ్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాక్

మరోవైపు పాకిస్థాన్ విషయానికి వస్తే ఈ మ్యాచ్‌ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. హాంకాంగ్‌ మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. ఇంతకుముందు బలహీనంగా ఉన్న పాక్‌.. గత ఏడాదిలో బలంగా తయారైంది. భారత్‌కు సమవుజ్జీగా మారింది. చివరగా గత ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీలో రెండు జట్లూ తలపడగా.. భారత్‌పై పాక్‌ భారీ విజయం సాధించింది. ఓపెనర్లు ఇమామ్‌ ఉల్‌ హక్‌, ఫకార్‌ జమాన్‌లతో పాటు బాబర్‌ ఆజాం ఫామ్‌లో ఉన్నారు. ఆసియాకప్‌లో భారత్‌పై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు చేసిన షోయబ్‌ మాలిక్‌ ఈసారీ కీలకం కానున్నాడు. బౌలింగ్‌లో ఉస్మాన్‌ ఖాన్‌, హసన్‌ అలీ, ఫహీమ్‌ అష్రాప్‌ కూడా చక్కటి ఫామ్‌లో ఉన్నారు. ఆమీర్ గురించి చెప్పాల్సిన పని లేదు.

పాకిస్థాన్ జట్టు బలం: బౌలింగ్, టాపార్డర్ బ్యాటింగ్

బలహీనత: స్పిన్ బౌలింగ్

కీలక ఆటగాళ్లు: ఫకార్ జమాన్, బాబర్ అజాం, ఉస్మాన్ ఖాన్, ఇమామ్ ఉల్ హక్, హసన్ అలీ

భారత జట్టు అంచనా :

భారత జట్టు అంచనా :

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, ధోని, కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్, హర్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బమ్రా, ఖలీల్ అహ్మద్.

పాకిస్తాన్ జట్టు అంచనా:

ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజామ్, షోయబ్ మాలిక్, సర్ఫ్రాజ్ అహ్మద్ , ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఫహిమ్ అష్రఫ్, హసన్ ఆలీ, మహమ్మద్ అమిర్, ఉస్మాన్ ఖాన్.

ఆసియా కప్‌: నేడు భారత్‌ X పాకిస్థాన్‌

సాయంత్రం 5 గంటలకు మ్యాచ్ ప్రారంభం

Story first published: Wednesday, September 19, 2018, 15:47 [IST]
Other articles published on Sep 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X