
ఆసియా కప్ టోర్నీలో భారత్‌కు విజయవంతమైన చరిత్ర:
‘ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ టోర్నీలో భారత్‌కు ఎంతో విజయవంతమైన చరిత్ర ఉంది. కానీ, ఈ సారి ఆసియా కప్‌లో భారత్ మొదటి టైటిల్ ఫేవరెట్ కాదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ ఏడాది టైటిల్ పాక్ అందుకుంటుందని అనుకుంటున్నా. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది భారత జట్టులో విరాట్ కోహ్లీ లేడు. ఇక మిగతావి చూస్తూ గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ విజేత పాకిస్థాన్. అంతేకాకుండా యూఏఈలో పాక్‌కు మంచి రికార్డు ఉంది. పాక్‌కు ఇది హోం గ్రౌండ్. ఇవన్నీ పాక్‌కు కలిసొచ్చే అంశాలు. అన్ని జట్ల మధ్య పోటీలు ఆసక్తికరంగా సాగుతాయి. మరి చివరికి టైటిల్ ఎవరికి దక్కుతుందో చూద్దాం' అని ఆయన అన్నారు.

3 ట్రోఫీలలో భారత్ ఏకంగా ఆరు సార్లు టైటిల్ విజేతగా
కొన్ని సంవత్సరాలుగా వన్డే టోర్నమెంట్లతో పాటు ఐసీసీ 50 ఓవర్ల ప్రపంచ కప్, ఐసీసీ వరల్డ్ టీ 20, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలలో భారత్ విజయ పంథాను కొనసాగిస్తూనే ఉంది. కొద్ది మేరకే భారత్ ట్రోఫీలను కోల్పోయింది. కానీ, ఆసియా కప్ టోర్నమెంట్‌లో సాధించిన ఆధిక్యత మరే దాంట్లో భారత్ తెచ్చుకోలేకపోయింది. ఇప్పటివరకూ జరిగిన 13 ట్రోఫీలలో భారత్ ఏకంగా ఆరు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది.

వేదికలు మారనున్న దుబాయ్.. అబుదాబిలు:
ఆఖరి సారి జరిగిన టోర్నీలోనూ భారత్‌యే విజేత. ఈ క్రమంలో భారత్ తర్వాతి స్థానంలో శ్రీలంక నిలిచింది. కానీ, భారత ఆధిక్యత ప్రత్యేకంగా మూడు టోర్నీల్లో (1988, 1990-91, 1995) విశేషంగా నిలిచింది. ఈ మూడు టోర్నీల్లో మాత్రం భారత్ ఫైనల్స్‌లో శ్రీలంకనే ఓడించింది.సెప్టెంబర్ 15 నుంచి మొదలుకానున్న ఆసియా కప్ 2018 టోర్నీలో టీమిండియా ఆడనుంది. సెప్టెంబర్ 18 నుంచి హాంగ్‌కాంగ్‌తో జరిగే తొలి మ్యాచ్ 16 మంది సభ్యులతో కూడిన జట్టులో భాగమైంది. ఈ టోర్నీకి వేదికలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్, అబు దాబిలు కానున్నాయి.

ఫైనల్ పోరులో శ్రీలంకతోనే మూడు సార్లు:
టోర్నమెంట్‌లో ఉన్న గ్రూపులు రెండు ఏ, బీ. ఇందులో గ్రూపు ఏ కు సంబంధించి ఇండియా, పాకిస్తాన్, హాంగ్‌కాంగ్ . గ్రూపు బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్‌లు ఉన్నాయి. కాగా, భారత్ ఈ టోర్నీలో ఆరు సార్లు టైటిల్ గెలుచుకోగా, శ్రీలంక ఐదు సార్లు విజేతగా నిలిచింది. భారత్ విజేతగా నిలిచిన ఆరింటిలో మూడు సార్లు ఫైనల్ పోరులో శ్రీలంకతోనే పోరాడటం గమనార్హం.


Click it and Unblock the Notifications












