ఆసియా కప్: రోహిత్ శర్మ సారథ్యంపై లెజెండరీ క్రికెటర్లు ఏమన్నారంటే!

హైదరాబాద్: రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో జైత్రయాత్ర కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు టోర్నీలో భాగంగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది.
అయితే, ఈ నాలుగింట రెండు మ్యాచ్‌లు చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌పై టీమిండియా విజయం సాధించడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇంగ్లీషు గడ్డపై వన్డే, టెస్టు సిరిస్‌ను చేజార్చుకున్న టీమిండియాతో పాటు అటు భారత అభిమానులకు సైతం ఈ విజయాలు కాస్త ఊరటనిస్తున్నాయి.
ముఖ్యంగా యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో భారత ఆటగాళ్లు చెలరేగుతున్నారు. హాంకాంగ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మినహాయించి మిగతా మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా ఏకపక్షంగానే విజయం సాధించింది. ఈ విజయాలు టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనకు నిదర్శనం.
ఈ టోర్నీతో రోహిత్ శర్మ కెప్టెన్సీపై ఉన్న సందేహాలు పూర్తిగా తొలగిపోయాయి. వర్క్‌లోడ్, రాబోయే సిరిస్‌లను దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా చేపట్టిన సంగతి తెలిసిందే. ఆసియా కప్‌లో వరుస విజయాలకు కారణమైన కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

సునీల్ గవాస్కర్
ఆసియాకప్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యం బాగుందని బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసించాడు. నాయకత్వ బాధ్యతలు అప్పగించిన తర్వాతే అతనిలోని బ్యాట్స్‌మన్ అత్యుత్తమంగా రాణిస్తున్నాడని కొనియాడాడు. ఈ సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ "రోహిత్‌కు సారథిగా అవకాశం వచ్చిన ప్రతిసారి న్యాయం చేశాడు. ముంబై ఇండియన్స్‌కు మూడుసార్లు కప్‌ను అందించడంలో అతనిదే కీలక పాత్ర. బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా ఓర్పు గా, సహనంగా వ్యవహరిస్తున్నాడు. దీనివల్లే అతనిలోని బ్యాట్స్‌మన్ అత్యుత్తమైన ప్రదర్శనను చూపెడుతున్నాడు. ధావన్‌తో రోహిత్ ఓపెనింగ్ సూపర్. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంలో ఈ ఇద్దరూ ఎవరికీ తీసిపోరు. టెస్టు జట్టులో చోటు కోల్పోవడంతో రోహిత్ శర్మలో చాలా మార్పు వచ్చింది. పరిణతితో ఆలోచిస్తూ ముందుకెళ్తున్నాడు" అని పేర్కొన్నాడు.

వసీం అక్రమ్
ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీ లేకపోయినా రోహిత్ శర్మ జట్టును అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాడని కొనియాడాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ చేసిన సెంచరీ తనను ఎంతగానో ఆకట్టుకుందని వసీం అక్రమ్ అన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ "రోహిత్ శర్మ కెప్టెన్ బాధ్యతలను గొప్పగా నిర్వర్తిస్తున్నాడు. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. సులభంగా పరుగులు రాబడుతున్నాడు. ధావన్ కూడా అతనితో సమానంగా రాణిస్తున్నాడు. వీరిద్దరూ క్రీజులోకి వచ్చారంటే పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఎంతో ప్రశాంతంగా కనిపిస్తారు" అని అన్నాడు.

హర్భజన్ సింగ్
ఆసియా కప్‌కు విరాట్ కోహ్లీ అందుబాటులో లేని సమయంలో రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించడం మంచిదని తాను అనుకుంటున్నట్లు టీమిండియా వెటనర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఈ సందర్భంగా భజ్జీ మాట్లాడుతూ "కెప్టెన్‌గా రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఓ వైపు పరుగులు చేస్తూనే, మరోవైపు జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. మైదానంలో కామ్‌గా ఉంటూ తన పని తాను చేసుకుపోతున్నాడు. కోహ్లీ అందుబాటులో లేని సమయంలో రోహిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాలి" అని హర్భజన్ తెలిపాడు.

కపిల్ దేవ్
"ఇప్పటివరకు ఆసియా కప్‌లో భారత జట్టు ఏవైతే విజయాలు సాధించిందో ఆ విజయాలన్నీ సమిష్టిగా ఆడటం వల్లే సాధించింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ జట్టుని ముందుండి నడిపిస్తున్నాడు. ఆసియా కప్‌ను విజయంతోనే భారత్ ముగిస్తుందని భావిస్తున్నా" అని లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications