

హైదరాబాద్: ఆసియాకప్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్లో అద్భుతమైన సూపర్ త్రో విసిరిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
ఇందులో రవీంద్ర జడేజా విసిరిన సూపర్ త్రో కారణంగా బంగ్లా బ్యాట్స్‌మన్ మహ్మద్ మిథున్ (2) పెవిలియన్‌కు చేరాడు. చాహల్ వేసిన 28వ ఓవర్‌లో లిటన్ దాస్ ఆడిన షాట్‌ను ఎక్స్‌ట్రా కవర్‌లో జడేజా అద్భుతంగా డైవ్ చేస్తూ ఆపేశాడు. ఇది ఊహించని మిథున్ అప్పటికే నాన్‌స్ట్రయిక్ ఎండ్ నుంచి పరుగు తీయగా ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఒకే ఎండ్‌లో ఉన్నట్టయింది.
ఈ సమయంలో మెరుపు వేగంతో స్పందించిన జడేజా.. ముందు ధోనీ వైపు బంతిని వేయాలని ప్రయత్నించినప్పటికీ, ఆ తర్వాత అతడు నాన్‌స్ట్రయిక్ వైపు విసరాలని చూపించడంతో అంతే చురుగ్గా చాహల్‌కు బంతిని అందివ్వడంతో అతడు వికెట్లను పడగొట్టాడు. దీంతో మహ్మద్ మిథున్ (2) పెవిలియన్‌కు చేరాడు.
నిజానికి ఆసియాకప్ కోసం ప్రకటించిన జట్టులో రవీంద్ర జడేజాకు చోటు దక్కలేదు. అయితే, గాయం కారణంగా హార్దిక్ పాండ్యా టోర్నీకి దూరం కావడంతో అతడి స్థానంలో సెలక్టర్లు జడేజాకు అవకాశమిచ్చారు. తనకు అందివచ్చిన అవకాశాన్ని జడేజా చక్కగా వినియోగించుకున్నాడు.
సూపర్-4లో భాగంగా పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో సైతం జడేజా 33 బంతుల్లో 23 పరుగులు చేశాడు.