న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్: భారత్ Vs ఆప్ఘనిస్థాన్ మ్యాచ్‌పై బెస్ట్ మీమ్స్ ఇవే!

ASIA CUP 2018 : India vs Afghanistan Best Memes Of The Match
 Asia Cup 2018: Super Four, Match 5, India vs Afghanistan- Best memes of the match

హైదరాబాద్: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌ సూపర్-4లో టీమిండియాకు ఊహించని ఫలితం ఎదురైంది. టోర్నీలో భాగంగా మంగళవారం దుబాయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధిస్తుందని అనుకుంటే, మ్యాచ్‌ అనూహ్యంగా టైగా ముగిసింది.

<strong>ఒక్క రివ్యూ తప్పిదంతో ఇద్దరూ అవుట్</strong>ఒక్క రివ్యూ తప్పిదంతో ఇద్దరూ అవుట్

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. అనంతరం 253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది.

1
44056

ఓపెనర్‌గా అంబటి రాయుడు

లక్ష్య చేధనలో భారత జట్టు ఆటగాళ్లు కేఎల్ రాహుల్, అంబటి రాయుడు మెరుపు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందొచ్చిన అంబటి రాయుడు సిక్స్‌లతో చెలరేగాడు. రాహుల్‌ 55 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, రాయుడు 43 బంతుల్లోనే హాఫ్ సెంచరీని సాధించాడు.

ఉత్కంఠగా మారిన మ్యాచ్

దూకుడుగా ఆడే క్రమంలో రాయుడు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాహుల్ సైతం పెవిలియన్‌కు చేరాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత భారత స్కోరు నెమ్మదించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని (8), పాండే (8), జాదవ్‌ (19) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఆ తర్వాత కార్తీక్‌ (44) ఔట్‌ కావడంలో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.

ఆఖరి ఓవర్‌లో 7 పరుగులు

ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయానికి ఆఖరి ఓవర్‌లో 7 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో ఒకే ఒక వికెట్ ఉంది. ఆప్ఘన్ కెప్టెన్ అస్గర్ బౌలర్ రషీద్‌ఖాన్‌‌కు బంతి ఇచ్చాడు. ఈ సమయంలో క్రీజులో ఉన్న ఆల్‌రౌండర్‌ జడేజా రెండో బంతికి ఫోర్‌ కొట్టి ఆశలు రేపాడు. ఆ తర్వాత మరో రెండు సింగిల్స్‌ రావడంతో స్కోర్ సమమైంది.

టైగా ముగిసిన మ్యాచ్

ఇంకా రెండు బంతులు మిగిలి ఉండడం.. జడేజా స్ట్రైకింగ్‌లో ఉండడంతో భారత్‌దే విజయం అని అనుకున్నారంతా. కానీ, ఐదో బంతిని గాల్లోకి లేపిన జడేజా ఔట్‌ కావడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. అయితే, టీమిండియాకు ఊరటనిచ్చే విషయం ఏంటంటే ఈ టోర్నీలో భారత్‌ ఇప్పటికే ఫైనల్‌‌కు చేరుకోవడం. ఈ మ్యాచ్‌పై సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు పంచుకున్న మీమ్స్ వైరల్‌గా మారాయి.

Story first published: Wednesday, September 26, 2018, 13:40 [IST]
Other articles published on Sep 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X