
మూడు హాఫ్ సెంచరీలు బాదిన మూడో భారత క్రికెటర్
3 - ఆసియా కప్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదిన మూడో భారత క్రికెటర్ రోహిత్ శర్మ. శ్రీలంక ఆటగాడు అర్జున రణతుంగ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత కెప్టెన్ కూడా.
3 - పాకిస్థాన్‌పై ఒకే వన్డేలో రెండు సెంచరీలు నమోదు కావడం భారత్‌కు ఇది మూడోసారి. షార్జా వేదికగా 1996లో షార్జాలో జరిగిన వన్డేలో సచిన్ టెండూల్కర్ - నవజ్యోత్ సింగ్ సిద్దూలు సెంచరీ చేయగా, 2005లో కోచ్చి వేదికగా జరిగిన వన్డేలో వీరేంద్ర సెహ్వాగ్ - రాహుల్ ద్రవిడ్ సెంచరీలు చేశారు.
9 - వికెట్ల తేడా పరంగా పాక్‌పై భారత్‌కు ఇదే భారీ విజయం. గత ఆరేళ్లలో 9 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఓటమి పాలవ్వడం ఇదే మొదటిసారి.

వన్డేల్లో 50 వికెట్లు
30 - వన్డేల్లో 50 వికెట్లు తీసేందుకు చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహాల్ తీసుకున్న మ్యాచ్‌లు. వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఐదో భారత బౌలర్.
102 - వన్డేల్లో ఓపెనర్‌గా 5000 పరుగుల మైలురాయిని అందుకునేందుకు రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్‌లు.
19 - వన్డేల్లో రోహిత్ శర్మ సాధించిన సెంచరీ సంఖ్య. అతడికి ఇది 187వ మ్యాచ్.
15 - వన్డేల్లో శిఖర్ ధావన్ చేసిన సెంచరీల సంఖ్య. అతడికిది 109వ మ్యాచ్.

7 వేల పరుగులు పూర్తి చేసిన తొమ్మిదో భారత బ్యాట్స్‌మన్
7000 - వన్డేల్లో 7 వేల పరుగులు పూర్తి చేసిన తొమ్మిదో భారత ఆటగాడిగా రోహిత్. అలాగే ఈ ఫీట్‌కు అత్యంత తక్కువ ఇన్నింగ్స్ (181) తీసుకున్న ఐదో బ్యాట్స్‌మన్. అతడికంటే ముందు ఆమ్లా (150), కోహ్లీ (161), డివిలియర్స్ (166), గంగూలీ (174) ఉన్నారు.
13 - భారత్ తరఫున ఎక్కువసార్లు (13) సెంచరీకి పైగా భాగస్వామ్యాన్ని అందించిన రెండో భారత జోడీగా రోహిత్, ధవన్. తొలిస్థానంలో గంగూలీ, సచిన్ (21) ఉన్నారు. ఓవరాల్‌గా ఈ జంటది నాలుగో స్థానం.

రోహిత్ శర్మ బాదిన సిక్సులు 301
301 - అంతర్జాతీయ కెరీర్‌లో రోహిత్ శర్మ బాదిన సిక్సుల సంఖ్య. అంతర్జాతీయ క్రికెట్‌లో 300కుపైగా సిక్సులు బాదిన ఏడో బ్యాట్స్‌మెన్. అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఆటగాళ్లలో రెండోవాడు.
210 - ఓపెనర్లు తొలి వికెట్‌కు 210 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఫలితంగా ఛేజింగ్‌లో తొలి వికెట్‌కు అత్యధిక భాగస‍్వామ‍్యాన్ని సాధించిన భారత జోడిగా రికార్డులకెక్కింది. ఈ క్రమంలోనే 2009లో హామిల్టన్‌లో న్యూజిలాండ్‌పై గంభీర్-సెహ్వాగ్ జోడి సాధించిన 209 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని అధిగమించారు.


Click it and Unblock the Notifications













