
దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా సూపర్4కు చేరుకున్న భారత్, పాక్‌లు బుధవారం తలపడనున్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజాలు టీమిండియా భారత జట్టే ఫేవరేట్‌గా బరిలోకి దిగనుందంటూ కితాబిస్తున్నారు. టోర్నమెంట్‌లో భాగంగా గ్రూపు ఏ నుంచి ఇరు జట్లు రెండో సారి తలపడనున్నాయి. 2017 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ తర్వాత భారత్.. పాకిస్తాన్‌లు తలపడిన మొదటి టోర్నీ ఇది.
సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం టీమిండియా ఆడుతున్న తీరు చూస్తుంటే సునాయాసంగా విజయం సొంతం చేసుకోగలదని భావిస్తున్నా. కానీ, పాకిస్తాన్ ఆట తీరు చూస్తుంటే చాలా బాగా ఆడితేనే తప్ప విజయం పొందలేదు. ఇప్పటికే ఈ టోర్నీలో ఓ సారి ఈ జట్లు తలపడ్డాయి. దీంతో పాటుగా ఈ వికెట్‌పై పరుగులు చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంది.' అని చెప్పాడు.
ఇదే విధంగా పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా మాట్లాడుతూ.. 'పాక్‌పై భారత్ గెలిచేందుకు 60-40వరకూ అవకాశాలు ఉన్నాయి. పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ మొహమ్మద్ అమీర్‌లోనూ కాన్పిడెన్స్ స్థాయి కూడా తక్కువగానే కనిపిస్తుంది. ఇక టాస్ పడిన తర్వాత పాక్ బ్యాట్స్‌మెన్ ఆలోచించే విధానాన్ని బట్టి ఫలితాలు ఉంటాయని' భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.
ఆదివారం పాక్‌తో తలపడనున్న భారత్ భీకరమైన ఫామ్‌లో కనిపిస్తోంది. పాకిస్తాన్ మాత్రం టోర్నీలో మ్యాచ్ గెలిచేందుకు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటుంది. కానీ, భారత్-పాక్ మ్యాచ్ అంటే పరిస్థితులను ఎవ్వరూ సరిగ్గా అంచనా వేయలేరు. ఈ క్రమంలోనే ఇదే టోర్నీలో దాయాది జట్ల మధ్య రెండో సారి జరగనున్న మ్యాచ్‌పై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.