For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్యాటింగ్‌లో రోహిత్‌కు సలహాలిస్తున్న చాహల్

Asia Cup 2018 : Yuzvendra Chahal Posts Rohit Sharma's Video
Asia Cup 2018: Rohit Sharma Gets Batting Advice From Yuzvendra Chahal

న్యూఢిల్లీ: ఆసియా కప్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లేమితో ఉన్న భారత జట్టును లీడ్ చేయనున్నాడు రోహిత్ శర్మ. ఈ నేపథ్యంలో హిట్ మాన్ రోహిత్ ఇప్పటికే నెట్స్‌లో ప్రాక్టీసు మొదలుపెట్టేశాడు. మరి కొద్ది రోజుల్లో మొదలుకానున్న ఈ టోర్నీకి కోహ్లీ అనారోగ్యం కారణంగా దూరం కానున్నాడు. మంగళవారంతో ముగిసిపోయిన ఇంగ్లాండ్ పర్యటనలో ఆఖరిదైన టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ చోటు దక్కించుకోకపోయిన విషయం తెలిసిందే.

గతంలో కొన్ని సార్లు టీమిండియాను లీడ్ చేసి విజయ పథంలో నడిపించిన రోహిత్ మళ్లీ అదే తరహాలో ఫలితాలను రాబట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రాక్టీసు చేస్తున్న రోహిత్‌పై యుజ్వేంద్ర చాహల్ కౌంటర్లు విసురుతున్నాడు. రోహిత్ డిఫెన్స్ ఆడుతున్న ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దానికి స్పందించిన చాహల్ 'డిఫెన్స్ కాదు ఆడాల్సింది గాలిలోకి ఆడాలి సోదరా' అంటూ కామెంట్ చేశాడు.

సెప్టెంబర్ 15 నుంచి మొదలుకానున్న ఆసియా కప్ 2018 టోర్నీలో టీమిండియా ఆడనుంది. సెప్టెంబర్ 18 నుంచి హాంగ్‌కాంగ్‌తో జరిగే తొలి మ్యాచ్ 16 మంది సభ్యులతో కూడిన జట్టులో భాగమైంది. ఈ టోర్నీకి వేదికలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్, అబు దాబిలు కానున్నాయి.

టోర్నమెంట్‌లో ఉన్న గ్రూపులు రెండు ఏ, బీ. ఇందులో గ్రూపు ఏ కు సంబంధించి ఇండియా, పాకిస్తాన్, హాంగ్‌కాంగ్ . గ్రూపు బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్‌లు ఉన్నాయి. కాగా, భారత్ ఈ టోర్నీలో ఆరు సార్లు టైటిల్ గెలుచుకోగా, శ్రీలంక ఐదు సార్లు విజేతగా నిలిచింది. భారత్ విజేతగా నిలిచిన ఆరింటిలో మూడు సార్లు ఫైనల్ పోరులో శ్రీలంకతోనే పోరాడటం గమనార్హం.

Story first published: Wednesday, September 12, 2018, 18:31 [IST]
Other articles published on Sep 12, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+