న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ జట్టులో ఉండటం రోహిత్ అదృష్టం!!

Asia Cup 2018: Rohit Sharma fortunate to have MS Dhoni around, feels Sunil Gavaskar

న్యూ ఢిల్లీ: ఆసియా కప్‌కి ఎంపిక చేసిన భారత జట్టులో మహేంద్రసింగ్ ధోనీ ఉండటం తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అదృష్టమని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. టోర్నీలో భాగంగా భారత జట్టు మంగళవారం సాయంత్రం హాంకాంగ్‌తో తొలి మ్యాచ్ ఆడనుండగా.. రెగ్యులర్ కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి ఈ టోర్నీ నుంచి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే.

 ధోనీ ప్రస్తుతం జట్టులో ఉండటం

ధోనీ ప్రస్తుతం జట్టులో ఉండటం

‘భారత్ జట్టు ప్రస్తుతం సీనియర్లు, జూనియర్లతో మంచి సమతూకంగా కనిపిస్తోంది. దీనికి తోడు వన్డేలంటే అమితంగా ఇష్టపడే రోహిత్ శర్మ కెప్టెన్‌గా జట్టుని ముందుండి నడిపించనున్నాడు. ఈ టోర్నీలో కనీసం రెండు సెంచరీలను సాధించాలని అతను ఆశిస్తున్నాడు. మ్యాచ్‌ల్లో ఏదైన క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు.. సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ధోనీ ప్రస్తుతం జట్టులో ఉండటం అతని అదృష్టం. జట్టుకి ధోనీ అనుభవం వెలకట్టలేని ఆస్తి. బౌలింగ్‌ సమయంలో అతనిచ్చే సలహాలు స్పిన్నర్లకి లాభించనున్నాయి' అని గవాస్కర్ వెల్లడించాడు.

కెప్టెన్‌గా రోహిత్ శర్మ జట్టుని

కెప్టెన్‌గా రోహిత్ శర్మ జట్టుని

కోహ్లీ లేని లోటు తెలియకుండా ధోనీ సాయంతో రోహిత్ శర్మ జట్టుని నడిపించాలని గవాస్కర్ సూచించాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో బుధవారం భారత జట్టు రెండో మ్యాచ్ ఆడనుంది. అయితే తర్వాతి రోజే పాకిస్తాన్‌తో ఆడాల్సి ఉంది కాబట్టి ఈ మ్యాచ్‌ను వీలైనంత తొందరగా ముగించి ప్రధాన పోరు కోసం తమ శక్తిని కాపాడుకునే ప్రయత్నం చేయవచ్చు. అది జరగాలంటే భారత్‌ టాస్‌ నెగ్గాలి. ఈ విషయంలో కోహ్లితో పోలిస్తే రోహిత్‌ అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.

పాక్‌ చేతిలో చిత్తుగా ఓడిన ఆ జట్టు

పాక్‌ చేతిలో చిత్తుగా ఓడిన ఆ జట్టు

క్వాలిఫయింగ్‌ టోర్నీలో తమకంటే బలమైన జట్లను ఓడించి హాంకాంగ్‌ ఈ దశకు అర్హత సాధించింది. తొలి మ్యాచ్‌లో పాక్‌ చేతిలో చిత్తుగా ఓడిన ఆ జట్టు భారత్‌పై కాస్త మెరుగ్గా ఆడాలని భావిస్తోంది. భారత జట్టు కుర్రాళ్లు, అనుభవజ్ఞులతో సమతూకంగా ఉంది. ముఖ్యంగా రోహిత్‌ తన ఖాతాలో మరో కొన్నిసెంచరీలు చేర్చుకోవాలని భావిస్తున్నాడు. క్లిష్ట సమయాల్లో అండగా నిలిచేందుకు గవాస్కర్ చెప్పినట్లు పక్కనే ధోని ఉండటం కూడా రోహిత్‌ అదృష్టం.

బౌలింగ్‌లోనూ వైవిధ్యంతో ఆకట్టుకుంటోన్న:

బౌలింగ్‌లోనూ వైవిధ్యంతో ఆకట్టుకుంటోన్న:

సాధారణంగా ఇండియా జట్టు ఆకర్షణ అంతా బ్యాటింగ్‌లోనే కనిపిస్తుంది. కానీ, ఈసారి బౌలింగ్‌లో ఉన్న వైవిధ్యం కూడా ఆకట్టుకునేలా చేస్తోంది. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్‌ వేర్వేరు శైలిలో వికెట్లు పడగొట్టడమే కాకుండా ఒకరిని మరొకరు ప్రోత్సహించుకునే తీరు చాలా బాగుంటుంది. మామూలుగా అయితే తమ బ్యాట్స్‌మెన్‌ ఎక్కువసేపు క్రీజ్‌లో గడపాలని కోరుకుంటుంది కాబట్టి అవకాశం లభిస్తే భారత్‌ తొలుత బ్యాటింగ్‌కే మొగ్గు చూపుతుంది.

Story first published: Tuesday, September 18, 2018, 17:01 [IST]
Other articles published on Sep 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X