న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రో'హిట్' నాయకత్వం: ఆసియా కప్‌లోనూ భారతే విజేత

Asia Cup 2018: Rohit Sharma Eyes Third Series Win As Captain

హైదరాబాద్: ఒక సిరీస్‌కు పూర్తి స్థాయిలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపడుతున్న రోహిత్ శర్మ జట్టును విజయవంతంగా నడిపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతి కల్పించడంతో యూఏఈ వేదికగా ప్రారంభమయ్యే ఆసియా కప్‌ టోర్నీకి రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ తన కెప్టెన్సీలో భారత్‌ను మరోసారి విజేతగా నిలపాలనేది అభిమానుల ఆకాంక్ష.

పూర్తి స్థాయి సిరీస్‌కు రోహిత్‌ శర్మ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించడం ఇది నాలుగోసారి. గత ఏడాది డిసెంబరులో విరాట్‌ కోహ్లీ వివాహం నేపథ్యంలో శ్రీలంక పర్యటన నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ రోహిత్‌ శర్మకు మొదటిసారి జట్టు పగ్గాలు అప్పగించింది. రోహిత్‌ శర్మ నాయకత్వంలో లంక పర్యటనకు వెళ్లిన టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌ల్లో విజేతగా నిలిచింది.

ఓటములే గుణపాఠాలై.: ప్రాక్టీసు మ్యాచ్‌లు ఆడతామంటోన్న రవిశాస్త్రిఓటములే గుణపాఠాలై.: ప్రాక్టీసు మ్యాచ్‌లు ఆడతామంటోన్న రవిశాస్త్రి

ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనతో తీరికలేని క్రికెట్‌ ఆడిన కారణంగా మరోసారి బీసీసీఐ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చింది. దీంతో శ్రీలంకలో నిర్వహించిన నిదహాస్‌ ట్రోఫీలో పాల్గొనే జట్టుకు మరోసారి రోహిత్‌ శర్మ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత రోహిత్‌ శర్మ ఓ సిరీస్‌కు మళ్లీ పూర్తి స్థాయిలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకుంటున్నాడు రోహిత్.

రో'హిట్' నాయకత్వంలో ఆసియా కప్‌ టోర్నీ కోసం టీమిండియా యూఏఈలో పర్యటిస్తోంది. అతను టీమిండియాకు నాయకత్వం వహించిన ప్రతిసారీ భారత్‌ విజేతగా నిలిచింది. ఈ నెల 15న ప్రారంభమయ్యే ఆసియా కప్‌ టోర్నీ 30తో ముగియనుంది. టోర్నీలో భాగంగా 18న హాంకాంగ్‌తో, 19న పాకిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది. ఇప్పటికే దుబాయ్‌కు టీమిండియాలో కొందరు చేరుకోగా ఇంగ్లాండ్ పర్యటన ముగించుకుని పూర్తి స్థాయి బృందం కలవడానికి మిగిలిన వారు ఆదివారం బయల్దేరనున్నారు.

Story first published: Friday, September 14, 2018, 16:34 [IST]
Other articles published on Sep 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X