ఆసియా కప్: సారథిగా సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ

హైదరాబాద్: ఆసియాకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. టోర్నీలో భాగంగా ఆదివారం భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అలవోక విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓపెనర్లు రోహిత్ శర్మ (119 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 111 నాటౌట్), శిఖర్ ధావన్ (100 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 114) సూపర్ సెంచరీలతో రాణించడంతో పాక్‌పై భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఫలితంగా రోహిత్ శర్న నేతృత్ంలోని టీమిండియా ఆసియా కప్ ఫైనల్లో ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 237 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (78) హాఫ్ సెంచరీ చేయగా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (44) రాణించాడు. భారత బౌలర్లలో బుమ్రా, చాహల్, కుల్దీప్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.

210 పరుగుల భారీ భాగస్వామ్యం
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో పాక్ నిర్దేశించిన 237పరుగుల లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా ఛేదించగలిగింది. కెప్టెన్ రోహత్ శర్మ(111 నాటౌట్), శిఖర్ ధావన్ (114) ఆడి టీమిండియాకు ఆసియా కప్‌లో ఫైనల్ బెర్తును ఖరారు చేశారు.

రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు
ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డుని నెలకొల్పాడు. దుబాయి వేదికగా సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. గతంలోనూ కెప్టెన్ హోదాలో దుబాయి మైదానంలో అత్యధిక పరుగులు(83) చేసిన రికార్డు కూడా రోహిత్ శర్మదే. ఇప్పుడు తన రికార్డును తానే అధిగమించాడు.

111 పరుగులు చేసిన రెండో కెప్టెన్‌గా
ఇప్పటివరకు దుబాయి వేదికగా హాంకాంగ్ కెప్టెన్ అన్షుమాన్ రత్ (73), ఇంగ్లాండ్ కెప్టెన్ కుక్(80), దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (92)లు చేసిన పరుగులే అత్యధికం. దీంతో పాటు రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు చేసింది. భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన వన్డేల్లో అత్యధికంగా 111 పరుగులు చేసిన రెండో కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు.

ఈ ఘనత సాధించిన తొమ్మిదో భారత బ్యాట్స్‌మన్
ఇంతకు ముందు ఈ రికార్డు సచిన్(93), అజారుద్దీన్(100,101), ధోని(113)ల పేరిట ఉంది. ఆదివారం పాకిస్థాన్‌పై రోహిత్ శర్మ నమోదు చేసిన సెంచరీ వన్డేల్లో అతడికి 19వ సెంచరీ కావడం విశేషం. తద్వారా వన్డేల్లో ఏడువేల పరుగుల మైలురాయిని దాటాడు. ఈ ఘనత సాధించిన తొమ్మిదో భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ నిలిచాడు.

అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో
ఈ మైలురాయిని సాధించేందుకు అత్యంత తక్కువ ఇన్నింగ్స్ (181) తీసుకున్న ఐదో బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అతడికంటే ముందు హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా, 150), విరాట్ కోహ్లీ (ఇండియా, 161), ఏబీ డివిల్లీర్స్ (దక్షిణాఫ్రికా, 166), సౌరవ్ గంగూలీ (ఇండియా, 174) ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications