వెంటనే నొప్పి పెద్దగా అనిపించకపోయినా
గాయంతో పడిపోయిన వెంటనే నొప్పి పెద్దగా అనిపించకపోయినా క్రమంగా తీవ్రతరం అవుతుండటంతో వైద్యులు పాండ్యా మరి కొద్ది రోజుల పాటు నిలబడడానికి చాలా కష్టపడాలి అంటూ తేల్చేశారు. ప్రాథమిక చికిత్స అనంతరం అతణ్ని హాస్పిటల్‌కు తరలించగా నడుము కింది భాగంలో నొప్పితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
కేదర్ జాదవ్ కంటే పాండ్యా పైనే
హార్దిక్ పాండ్యా మైదానం వీడి వెళ్లిపోవడంతొ భారత క్రికెట్ అభిమానులు తీవ్రమైన నిరాశకు గురైయ్యారు. చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చిన కేదర్ జాదవ్ కంటే కూడా హార్దిక్ పాండ్యా పైనే ఆశలు పెట్టుకున్నారు క్రికెటర్ అభిమానులు. ఈ క్రమంలో కేదర్ జాదవ్ తన మిగిలిన ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసేందుకు చక్కటి అవకాశమే దక్కింది. కానీ, పాండ్యా అటు బ్యాటింగ్.. బౌలింగ్ లలో రెండు విభాగాల్లోనూ ఆడే అవకాశాన్ని కోల్పోయాడు.
|
రషీద్ ఖాన్.. గురించి భావోద్వగకరమైన ట్వీట్
ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. పాండ్యా గురించి భావోద్వగకరమైన ట్వీట్ చేశాడు. అతని గాయం జరిగిందని తెలిసిన వెంటనే.. అతనికి అదృష్టం కలసిరావాలి. త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తానని తెలిపాడు. ప్రత్యర్థులుగా మ్యాచ్‌లు ఆడి క్రీడా స్ఫూర్తి చాటిన రషీద్ ఖాన్ అలా ట్వీట్ చేయడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భారత జట్టుతో మంచి అనుబంధాన్ని
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన రషీద్ ఖాన్ అంతకంటే ముందు నుంచే భారత జట్టుతో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పడు తన ట్వీట్ ద్వారా మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేశాడు. ఇదే ఆసియా కప్‌లో సెప్టెంబర్ 25న టీమిండియా అఫ్గనిస్తాన్‌ను ఢీకొట్టనుంది.