ఆసియా కప్: కోహ్లీ, యూనిస్ ఎలైట్ జాబితాలోకి ముష్ఫికర్ రహీమ్


హైదరాబాద్: బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ అరుదైన ఘనత సాధించాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ ఆరంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకతో తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బంగ్లా క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ 150 బంతుల్లో 144 పరుగులు సాధించాడు.
ఫలితంగా ఆసియా కప్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 2012లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 183 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, పాకిస్థాన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ (144 పరుగులు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఐసీసీ ట్విట్టర్‌లో ట్వీట్
2004లో జరిగిన ఆసియా కప్‌లో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో యూనిస్ ఖాన్ ఈ పరుగులు నమోదు చేశాడు. తాజాగా, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ముష్ఫికర్ రహీమ్ (144 పరుగులు) చేయడంతో ఈ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మేరకు ఐసీసీ తన అధికారిక ట్విట్టర్లో ట్వీట్ చేసింది.

49.3 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌట్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 49.3 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (2) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ లిట్టన్ దాస్ పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన షకిబ్ ఉల్ హసన్ కూడా డకౌటయ్యాడు.

బంగ్లాదేశ్‌కి పోటీ ఇవ్వగల స్కోరు
అయినప్పటికీ బంగ్లా పోటీ ఇవ్వగల స్కోరు చేసిందంటే మాత్రం దానికి కారణం ముష్ఫికర్ రహీమ్. ఆరంభంలోనే ముగ్గురు బ్యాట్స్‌మెన్స్‌ను కోల్పోయిన బంగ్లాను ముష్ఫికర్ రహీమ్ (144; 150 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులు) ఒంటరి పోరు చేసి సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.

మూడో వికెట్‌కు 134 పరుగుల భాగస్వామ్యం
మహ్మద్ మిథున్(63) కలిసి అమూల్యమైన మూడో వికెట్‌కు 134 పరుగుల భాగస్వామ్యం అందించాడు. అయితే ఇతర బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో 261 పరుగులకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 35.2 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. దీంతో బంగ్లాదేశ్ 137 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications