ఆసియాకప్ ఫైనల్: సూపర్ ఫ్యాన్స్‌ని కలిసిన రోహిత్, ధోని (ఫోటోలు)

హైదరాబాద్: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓటమనేది లేకుండా ఆసియాకప్ ఫైనల్‌కు చేరుకుంది. టోర్నీలో భాగంగా ఫైనల్లో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతుంది.
శుక్రవారం జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌కి దుబాయి అంతర్జాతీయ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా వరుసగా రెండోసారి టైటిల్‌ను చేజిక్కించుకోవాలని చూస్తోంది. సూపర్-4లో భాగంగా ఆప్ఘన్-భారత జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసిన సంగతి తెలిసిందే.
టీమిండియా బస చేస్తోన్న హోటల్‌లోనే
ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని... పాకిస్థాన్ సూపర్ ఫ్యాన్ చాచా చికాగో, భారత సూపర్ ఫ్యాన్ సుధీర్ గౌతమ్‌లను కలిశారు. దుబాయిలో టీమిండియా బస చేసిన హోటల్‌లోనే ఈ సూపర్ ఫ్యాన్స్ బస చేస్తున్నారు.
సూపర్ ఫ్యాన్స్‌తో ఫోటోలు
ఈ నేపథ్యంలో బుధవారం రోహిత్ శర్మ, ధోనిలను కలిసిన ఈ ఇద్దరూ వారితో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. మరోవైపు సుధీర్ గౌతమ్ కూడా తన ట్విట్టర్‌లో ఈ ఫోటోలను పోస్టు చేశాడు.
ధోనితో సుధీర్ గౌతమ్ సెల్ఫీ
కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనితో సుధీర్ గౌతమ్ సెల్ఫీ.
ఫైనల్లో తలపడనున్న భారత్-బంగ్లాదేశ్
మొత్తం 6 జట్లతో ప్రారంభమైన ఆసియా కప్ టోర్నీలో చివరకు రెండు జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. శ్రీలంక, హాంకాంగ్ జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించగా... పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ జట్లు సూపర్-4లో నిష్క్రమించాయి. బంగ్లాదేశ్ జట్టు టోర్నీలో ఎప్పటికప్పుడు తన ప్రదర్శనని మెరుగుపర్చుకుంటూ అసాధారణ ఆటతో ఏకంగా ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్లో భారత్‌పై గెలిచిన రికార్డు బంగ్లాదేశ్‌కి లేకపోవడం విశేషం.
మూడోసారి ఫైనల్‌కు చేరిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ ఆసియాకప్ ఫైనల్ చేరడం ఇది మూడోసారి. 2016(టీ20 ఫార్మాట్)లో భారత్ చేతిలో ఓడిన బంగ్లా.. 2012లో పాకిస్థాన్ చేతిలో పరాజయంపాలైంది. ఇప్పుడో మరోసారి భారత్-బంగ్లాదేశ్‌లు మరోసారి టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. 2016లో జరిగిన ఆసియాకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు భారత్ ఇప్పటివరకు ఆరు ఆసియాకప్ టైటిళ్లు గెలిచింది.
సుధీర్ గౌతమ్ చేతిలో భారత్-బంగ్లా ఫైనల్ టికెట్లు
శుక్రవారం జరగనున్న ఆసియాకప్ ఫైనల్లో భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసిన భారత్‌కు చెందిన సూపర్ ఫ్యాన్ సుధీర్ గౌతమ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications