Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా కప్: అతి పెద్ద వయస్కుడిగా, ధోని ఖాతాలో మరో రికార్డు

Asia Cup 2018 : MS Dhoni Becomes Second Oldest ODI Captain To Lead India
Asia Cup 2018: MS Dhoni Becomes Second Oldest ODI Captain To Lead India

హైదరాబాద్: ఆసియా కప్‌లో భాగంగా సూపర్-4లో మంగళవారం ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనికి 200వ వన్డే కావడం విశేషం. టోర్నీలో టీమిండియా ఇప్పటికే ఫైనల్‌‌కు చేరడంతో కెప్టెన్ రోహిత్ శర్మ‌కి ఈ మ్యాచ్ నుంచి టీమిండియా మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది.

దీంతో ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని బాధ్యతలు చేపట్టాడు. అతడు 696 రోజుల తర్వాత మరోసారి టీమ్‌కు కెప్టెన్సీ వహించాడు. కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న త‌ర్వాత దాదాపు రెండేళ్ల‌కు మ‌రోసారి ధోనీ కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ఈ మ్యాచ్‌తో ధోని ఖాతాలో మరో రికార్డు చేరిందని ఐసీసీ ట్వీట్‌ చేసింది.

టీమిండియాకు నాయకత్వం వహించిన అతి పెద్ద వయస్కుడిగా(37 ఏళ్ల 80రోజులు) ధోని అనుకోని రికార్డు నెలకొల్పాడు. భారత్‌కు అత్యధిక వయస్సు (37 ఏళ్ల 80 రోజులు)లో నాయకత్వం వహించిన ఆటగాడిగా అజహరుద్దీన్‌ (36 ఏళ్ల 124 రోజులు) రికార్డును ధోని ఈ సందర్భంగా అధిగమించాడు.

మొత్తంగా టీమిండియాకు (మహిళల, పురుషుల) జట్లకు నాయకత్వం వహించిన జాబితాలో దిగ్గజ క్రీడాకారిణి డియానా ఎడుల్జి (37 ఏళ్ల 184 రోజులు) తొలి స్థానంలో నిలవగా, ధోని రెండో స్థానంలో ఉన్నాడు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ టై‌గా ముగిసిన సంగతి తెలిసిందే.

భారత విజయానికి రెండు బంతుల్లో ఒక పరుగు అవసరమైన సమయంలో క్రీజులో బ్యాటింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ టై అయింది. ఇక, రోహిత్‌ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఆసియాకప్‌ టోర్నీ ఫైనల్‌లో శుక్రవారం బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

Story first published: Thursday, September 27, 2018, 13:45 [IST]
Other articles published on Sep 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+