For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ ప్రాక్టీస్ వీడియోను పోస్టు చేసిన బీసీసీఐ(వీడియో)

ASIA CUP 2018 : MS Dhoni Spotted Practicing Pull Shots
Asia Cup 2018: MS Dhoni Bats In Full Flow At Nets As India Gear Up For Pakistan Clash. Watch

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటన అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి మేరకు భారత జట్టుకు దూరమైయ్యాడు. ఈ క్రమంలో జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు భుజాన వేసుకున్నాడు. కెప్టెన్‌గా రోహిత్ ఉన్నా.. జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ ఉండడంతో క్రికెట్ అభిమానులంతా ధోనీపైనే ఆశలు నిలుపుకున్నారు. ఈ క్రమంలోనే నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీసు చేస్తున్న ధోనీ వీడియోను బీసీసీఐ అన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది.

తొలి మ్యాచ్‌లో భాగంగా మంగళవారం హాంకాంగ్‌ను ఎదుర్కోనున్న టీమిండియా.. బుధవారం పాకిస్థాన్‌తో తలపడనుంది. వెనువెంటనే మ్యాచ్‌లు ఉండటంతో భారత ఆటగాళ్లు సోమవారం వరకు నెట్‌ సెషన్‌లో తీవ్రంగా కసరత్తులు చేశారు. 'ఇన్‌ ఫోకస్ అండ్‌ ఇన్‌ ది జోన్‌.. మహేంద్రసింగ్‌ ధోనీ' అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఇందులో ధోనీ ఫుల్‌ ఫ్లోలో బంతులను ఎదుర్కొంటున్నాడు.

2017లో వన్డేలు, టీ20ల కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ.. ఇప్పటివరకు 321 వన్డేలు ఆడి 10046 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ఇటీవల ఇంగ్లాండ్‌ పర్యటనలో ధోనీ ఆకట్టుకోలేకపోయాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మొత్తం మూడు మ్యాచ్‌లలో ధోనీ కేవలం 79 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో తాజాగా జరగుతున్న ఆసియా కప్‌ కోసం ధోనీ తన ప్రాక్టీస్‌ను పెంచాడు.

ఈ సిరీస్‌లో ఫేవరెట్‌గా ఉన్న టీమిండియా.. మంగళవారం హాంకాంగ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం దాదాపు ఖరారైనట్లే అని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. ఇక బుధవారం జరగబోయే భారత్‌, పాక్ మ్యాచ్‌ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. కోహ్లీ లేకపోయినా జట్టుకు ఏ మాత్రం ఇబ్బందిలేదంటూ ప్రముఖులు, క్రికెట్ దిగ్గజాలు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Tuesday, September 18, 2018, 12:52 [IST]
Other articles published on Sep 18, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+