ఆసియా కప్‌లో కృనాల్‌కి ఛాన్సివ్వండి..: సెలక్టర్లకు అగార్కర్ సూచన

హైదరాబాద్: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో గాయపడిన ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ స్థానంలో రవీంద్ర జడేజాకి సెలక్టర్లు అవకాశం ఇవ్వడంపై టీమిండియా మాజీ పేస్ బౌలర్ అజిత్ అగార్కర్ మండిపడ్డాడు. పాక్‌తో బుధవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా కాసేపు ఫీల్డింగ్ చేసిన అక్షర్ పటేల్ చేతి వేలికి గాయమైంది.

అక్షర్ పటేల్‌ని పరీక్షించిన వైద్యులు
దీంతో.. అక్షర్ పటేల్‌ని పరీక్షించిన వైద్యులు గాయం తీవ్రత దృష్ట్యా కొన్ని రోజులు విశ్రాంతినివ్వాలని సూచించడంతో ఆసియా కప్ టోర్నీకే అతడు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ స్థానాన్ని రవీంద్ర జడేజాకి సెలక్టర్లు భర్తీ చేశారు. దీనిపై అజిత్ అగార్కర్ మాట్లాడుతూ "అక్షర్ పటేల్ స్థానంలో రవీంద్ర జడేజాని ఆసియా కప్ కోసం ఎంపిక చేయడం నన్ను ఆశ్చర్యపరిచింది" అని అన్నాడు.

కృనాల్ పాండ్యాకి సెలక్టర్లు అవకాశం ఇచ్చి ఉంటే
"అతడిని కాకుండా.. కృనాల్ పాండ్యాకి సెలక్టర్లు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. అతడు ఇటీవల లిస్ట్-ఎ క్రికెట్‌లో అద్భుతంగా రాణించాడు. కాబట్టి.. భారత జట్టుకి ఆడేందుకు అతను అర్హుడు" అని అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ నుంచి గాయాల కారణంగా ముగ్గురు భారత క్రికెటర్లు అర్ధాంతరంగా వైదొలిగారు.

వెన్నునొప్పితో టోర్నీ మొత్తానికి పాండ్యా దూరం
మంగళవారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వెన్నుకి గాయమైంది. దీంతో బంతి విసిరిన తర్వాత పిచ్ మధ్యలోనే ఈ ఆల్ రౌండర్ కుప్పకూలిపోయాడు. కొద్దిసేపు ఫిజియో సపర్యలు చేసినా.. అతను కనీసం నిల్చోలేకపోవడంతో.. స్ట్రెచర్ మీద మైదానం నుంచి వెలుపలికి తీసుకెళ్లాల్సి వచ్చింది.

అక్షర్ పటేల్ చేతి వేలికి గాయం
ఆ తర్వాత కొద్దిసేపటికే సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్ చేతి వేలికి గాయమైంది. వీరితో పాటు హాంకాంగ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ కూడా గాయపడటంతో.. ముగ్గురూ టోర్నీకి దూరమయ్యారు. వారి స్థానాల్లో వరుసగా రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, సిద్ధార్థ కౌల్‌కి సెలక్టర్లు అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications