న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియాకప్ ఫైనల్లో భారత్‌ను గెలిపించే ఆ ఐదుగురు ఎవరు?

Asia Cup 2018 : Ind vs Ban:5 Key Men For India In Final
 Asia Cup 2018: Key men for India in final

హైదరాబాద్: ఆసియాకప్ చివరిదశకు చేరుకుంది. మొత్తం ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో చివరకు రెండు జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. దుబాయి వేదికగా శుక్రవారం జరిగే ఫైనల్లో భారత్-బంగ్లాదేశ్‌ జట్లు తలపడనున్నాయి. మొత్తం 6 జట్లతో ప్రారంభమైన ఆసియా కప్ టోర్నీలో చివరకు రెండు జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి.

జహీర్‌తో కలిసి భార్య అనుష్క నటించిన సినిమాను చూసిన కోహ్లీజహీర్‌తో కలిసి భార్య అనుష్క నటించిన సినిమాను చూసిన కోహ్లీ

శ్రీలంక, హాంకాంగ్ జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించగా... పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ జట్లు సూపర్-4లో నిష్క్రమించాయి. బంగ్లాదేశ్ జట్టు టోర్నీలో ఎప్పటికప్పుడు తన ప్రదర్శనని మెరుగుపర్చుకుంటూ అసాధారణ ఆటతో ఏకంగా ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్లో భారత్‌పై గెలిచిన రికార్డు బంగ్లాదేశ్‌కి లేకపోవడం విశేషం.

బంగ్లాదేశ్‌ ఆసియాకప్‌ ఫైనల్‌ చేరడం ఇది మూడోసారి. 2016(టీ20 ఫార్మాట్‌)లో భారత్‌ చేతిలో ఓడిన బంగ్లా.. 2012లో పాకిస్థాన్‌ చేతిలో పరాజయంపాలైంది. ఇప్పుడో మరోసారి భారత్-బంగ్లాదేశ్‌లు మరోసారి టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. 2016లో జరిగిన ఆసియాకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది.

మరోవైపు భారత్‌ ఇప్పటివరకు ఆరు ఆసియాకప్‌ టైటిళ్లు గెలిచింది. భారత్ తర్వాత అత్యధిక టైటిళ్ల గెలిచిన జాబితాలో శ్రీలంక(5) రెండో స్థానంలో ఉంది. ఏడోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోన్న భారత జట్టు గెలుపు గుర్రాలను ఒక్కసారి పరిశీలిద్దాం...

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ

రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఆసియా కప్‌లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. అటు కెప్టెన్‌గా, ఇటు ఆటగాడిగా రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తనకు లభించిన కెప్టెన్ అవకాశాన్ని రోహిత్ శర్మ చక్కగా వినియోగించుకుంటున్నాడు. టోర్నీలో భాగంగా ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ 300కుపైగా పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఇప్పటికే రోహిత్ శర్మ సారథ్యంలో నిదాహాస్ ట్రోఫి నెగ్గిన టీమిండియా, ఇప్పుడు ఆసియా కప్‌పై కన్నేసింది.

 శిఖర్ ధావన్

శిఖర్ ధావన్

ఇంగ్లీషు గడ్డపై పరుగులు చేసేందుకు విఫలమైన ఓపెనర్ శిఖర్ ధావన్ తనకు ఎంతగానో కలిసొచ్చిన వన్డే ఫార్మాట్‌లో చెలరేగుతున్నాడు. ఆసియా కప్‌ ద్వారా మళ్లీ ధావన్ ఫామ్‌లోకి వచ్చాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు ఆసియా కప్ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. భారీ భాగస్వామ్యాలు నమోదు చేస్తుండటంతో టీమిండియా అలవోక విజయాలు నమోదు చేస్తోంది.

 రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజా

గాయం కారణంగా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఆసియాకప్‌కు దూరమవడంతో అతడి స్థానంలో రవీంద్ర జడేజా జట్టులోకి వచ్చాడు. జట్టులోకి వచ్చీరాగానే తనదైన మార్కుని చూపించాడు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. సూపర్-4లో భాగంగా ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగులు చేసినప్పటికీ జట్టుకు విజయాన్ని అందంచడంలో విఫలమయ్యాడు. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది.

 జస్ప్రీత్ బుమ్రా

జస్ప్రీత్ బుమ్రా

డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరొందిన జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు తాను ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు తీసి జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో బుమ్రా బంతితో అద్భుతమే చేశాడు.

భువనేశ్వర్ కుమార్

భువనేశ్వర్ కుమార్

ఇటీవలే ఇంగ్లాండ్‌తో ముగిసిన టెస్టు సిరిస్‌కు దూరమైన భువనేశ్వర్ కుమార్, ఆసియా కప్ టోర్నీలో తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. కొత్త బంతితో అద్భుతాలు సృష్టించాడు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో మూడు మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫైనల్లో కూడా భువీ తన మార్కుని చూపిస్తాడని అభిమానులు భావిస్తున్నారు.

 2014-2018: ఫైనల్స్‌లో టీమిండియా

2014-2018: ఫైనల్స్‌లో టీమిండియా

2014 - World T20 - సెమీస్‌లో ఓటమి

2015 - WC Semis - సెమీస్‌లో ఓటమి

2016 - World T20: సెమీస్‌లో ఓటమి

2017 - Champions Tropy - పైనల్లో ఓటమి

Story first published: Friday, September 28, 2018, 13:25 [IST]
Other articles published on Sep 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X